AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు అద్దిరిపోయే న్యూస్.. ఈ ప్లాన్స్‌తో డిస్నీ+ హాట్‌స్టార్, వింక్ మ్యూజిక్ ఫ్రీ..!

Airtel Plans: భారత టెలికాం మార్కెట్‌లో ప్రస్తుతం Jio నెట్‌వర్క్‌తో గట్టిగా పోటీ పడుతున్న ఏకైక టెలికా సంస్థ ఎయిర్‌టెల్ మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు ఎయిర్‌టెల్ కంపెనీ అందిస్తున్న అద్భుతమైన రిచార్జ్ ప్లాన్స్..

Airtel Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు అద్దిరిపోయే న్యూస్.. ఈ ప్లాన్స్‌తో డిస్నీ+ హాట్‌స్టార్, వింక్ మ్యూజిక్ ఫ్రీ..!
Airtel Annual Plans
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 04, 2023 | 8:56 PM

Share

Airtel Plans: భారత టెలికాం మార్కెట్‌లో ప్రస్తుతం Jio నెట్‌వర్క్‌తో గట్టిగా పోటీ పడుతున్న ఏకైక టెలికా సంస్థ ఎయిర్‌టెల్ మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు ఎయిర్‌టెల్ కంపెనీ అందిస్తున్న అద్భుతమైన రిచార్జ్ ప్లాన్స్, వాటిపై పెరుగుతున్న సబ్‌స్క్రైబర్ల సంఖ్యే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఇంకా ఇతర నెట్‌వర్క్స్ నుంచి పోర్టబులిటీ ద్వారా వేరేే నెట్‌వర్క్‌కి మారాలనుకుంటున్నవారిని కూడా ఎయిర్‌టెల్ తన అద్భుతమైన ప్లాన్స్‌తో ఆకర్షించగలుగుతోంది. ఈ క్రమంలో పోర్టబులిటీ ద్వారా ఎయిర్‌టెల్‌కి వస్తున్న వినియోగదారుల కోసం సదరు టెలికాం సంస్థ 3  ఆకర్షణీయమైన ప్లాన్స్ తీసుకొచ్చింది. వీటి ద్వారా అధిక మొత్తంలో డేటా, వ్యాలిడిటీ ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఆ ప్లాన్స్ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..

రూ.1,799 రిచార్జ్ ప్లాన్: ఎయిర్‌టెల్ అందిస్తున్న యాన్వల్ ప్రీపెయిడ్ ప్లాన్ 1,799 రూపాయలతో ప్రారంభమవుతోంది. రెండు సిమ్ కార్డ్స్ వాడుతూ రెండో దాన్ని తరచూ రిచార్జ్ చేయకూడదనుకునేవారికి ఈ ప్లాన్  ఎంతో ఉపయోగకరం. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం 5G నెట్‌వర్క్ కూడా అందుబాటులో ఉన్నందున హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను కూడా ఆస్వాదించవచ్చు.

రూ.2999 రిచార్జ్ ప్లాన్: ఎయిర్‌టెల్ అందించే రెండో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.2999. ఏడాది కాలం వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌ ద్వారా మీకు రోజూ 2GB డేటా లభిస్తుంది. అంటే ఏడాది కాలంలో మీరు 730GB డేటాను పొందుతారు. ఇంకా ప్రతి రోజూ 100 SMSలు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న వారికి అపోలో 24/7 సర్కిల్, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్ బ్యాక్, ఉచిత హలో ట్యూన్స్ ఇంకా వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభించనున్నాయి.

ఇవి కూడా చదవండి

రూ.3359 రిచార్జ్ ప్లాన్: ఎయిర్‌టెల్ అందించే అత్యుత్తమ ఖరీదైన ప్లాన్స్‌లో రూ.3359 కూడా ఒకటి. ఏడాది వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌ రీఛార్జ్ చేసుకున్న వారికి రోజుకు 2.5GB డేటాను అందించనుంది. అంటే మీరు ఈ ప్లాన్‌తో మొత్తం 912.5GB డేటా పొందవచ్చు. ఇంకా దేశంలోని అన్ని నెట్‌వర్క్స్‌తో మీరు ఉచితంగానే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు: రూ.3359 రీఛార్జ్ చేసుకున్న వారికి రోజుకు 100 SMSలు, 2.5GB డేటా ఉచితంగా అందిస్తుంది. అలాగే 5G డేటా కూడా అదనంగా లభిస్తుంది. అంతేకాదు ఒక సంవత్సరం పాటు డిస్నీ+హాట్‌స్టార్ ఫోన్ సబ్‌స్క్రిప్షన్, మూడు నెలల పాటు అపోలో 24/7, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ పై రూ.100 క్యాష్ బ్యాక్, ఉచిత హలో ట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్ యాక్సెస్‌లను కూడా అందిస్తుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..