AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ‘ధోని రిటైర్‌మెంట్’పై సెహ్వాగ్ అసహనం.. అలా పదేపదే అడగడం సరికాదంటూ..

MS Dhoni's Retirement: ఐపీఎల్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్‌పై ఎంఎస్ ధోనిని పదే పదే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు. ప్రతీసారి రిటైర్‌మెంట్‌ విషయంపై ప్రశ్నలతో ధోనిని ఇబ్బంది పెట్టడం సరికాదని..

MS Dhoni: ‘ధోని రిటైర్‌మెంట్’పై సెహ్వాగ్ అసహనం.. అలా పదేపదే అడగడం సరికాదంటూ..
Sehwag On Ms Dhoni's Retirement
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 04, 2023 | 8:00 PM

Share

MS Dhoni’s Retirement: ఐపీఎల్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్‌పై ఎంఎస్ ధోనిని పదే పదే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు. ప్రతీసారి రిటైర్‌మెంట్‌ విషయంపై ప్రశ్నలతో ధోనిని ఇబ్బంది పెట్టడం సరికాదని, అందుకు ధోని స్పందించాల్సిన అవసరం కూడా లేదని వీరూ అభిప్రాయపడ్డాడు. అయినా ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ధోని కంటే బాగా తెలిసిన క్రికెటర్ లేరని వ్యాఖ్యానించాడు. అసలేం జరిగిందంటే.. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో టాస్ సందర్భంలో కామెంటేటర్‌గా ఉన్న డానీ మోరిసన్.. ధోనిని రిటైర్మెంట్ గురించి ‘ఇదే చివరి సీజన్ కదా..?’ అని ప్రశించాడు. అందుకు ధోని కూడా ‘నాకు చివరి సీజన్ అని మీరు డిసైడ్ అయ్యారు నేను కాదు’ అంటూ చాకచక్యంగా సమాధానం ఇచ్చాడు.

అయితే ధోనిని అతని రిటైర్‌మెంట్ గురించి ఇప్పటికే చాలా మంది ప్రశ్నించారు. తాజాగా డానీ మోరిసన్ కూడా అదే క్రమంలో ప్రశ్నించడంతో సెహ్వాగ్ స్పందించాడు. ‘‘ ప్రతీసారి ధోనిని ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతారు..? నాకైతే అసలు అర్థం కాలేదు. ఒకవేళ ధోనికి ఇదే సీజన్ అయినా అన్ని సార్లు అడగాల్సిన అవసరం ఏంటి? రిటైర్మెంట్ అనేది తన ఇష్టం. బహుశా.. ధోనీ నోటి నుంచి ‘నాకు ఇదే చివరి సీజన్’ అని చెప్పించాలని ఆ కామెంటేటర్ భావించాడేమో’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

కాగా,  ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా మధ్యలోనే రద్దయింది. వర్షానికి ముందు బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 19.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అలాగే చెన్నై బౌలర్లలో మొయిన్ ఆలీ, మహీశ్ తీక్షణ, మతీష పతిరాన తలో 2 వికెట్లు తీసుకోగా, రవింద్ర జడేజా 1 వికెట్‌ను పడగొట్టాడు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచు రద్దు చేసినట్లు ఎంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..