- Telugu News Photo Gallery Cricket photos Csk captain ms dhoni with highest strike rate in ipl 2023 season virat kohli
IPL 2023: ధోనీ దెబ్బకు రోహిత్, కోహ్లీ ఢమాల్.. అత్యధిక స్ట్రైక్ రేట్‌తో అందనంత ఎత్తులో.. లిస్టులో ఎవరున్నారంటే?
IPL 2023 Highest Strike: ఇప్పటి వరకు ఈ ఐపీఎల్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన ధోనీ కేవలం 6 ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. ఇందులో ధోని 211.42 స్ట్రైక్ రేట్‌తో 74 పరుగులు చేశాడు.
Updated on: May 04, 2023 | 6:51 PM

ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్‌మెన్స్ విషయానికి వస్తే, సాధారణంగా అందరూ విదేశీ ఆటగాళ్ల వైపే చూస్తుంటారు. కానీ, ఈ వెర్షన్‌లో కథ వేరేలా ఉంది. యువకులను మించి ఆటతీరును ప్రదర్శించిన 41 ఏళ్ల ధోని.. ఈసారి ఐపీఎల్‌లో ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లోనే మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

ఇప్పటి వరకు ఈ ఐపీఎల్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన ధోనీ కేవలం 6 ఇన్నింగ్స్‌ల్లోనే బ్యాటింగ్ చేశాడు. ఇందులో ధోని 211.42 స్ట్రైక్ రేట్‌తో 74 పరుగులు చేశాడు. ఇందులో 2 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. అంటే బౌండరీలతోనే ధోనీ 56 పరుగులు చేశాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే 200+ స్ట్రైక్‌రేట్‌ను కలిగి ఉన్నారు. వారిలో ఒకరు మహేంద్ర సింగ్ ధోని కాగా.. మరొకరు రాహుల్ తెవాటియా. 6 ఇన్నింగ్స్‌లలో 63 పరుగులు చేసిన తెవాటియా 203.22 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.

రాజస్థాన్ తరపున ఆడుతున్న ధ్రువ్ జురెల్ 191.30 స్ట్రైక్ రేట్‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అజింక్య రహానే 6 ఇన్నింగ్స్‌లలో 190 స్ట్రైక్ రేట్‌తో 224 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు.

RCB గురించి మాట్లాడితే, ఆరెంజ్ క్యాప్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 159.58 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.

విరాట్ కోహ్లీ విషయానికి వస్తే, పరుగులు చేయడంలో ముందున్న విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ కేవలం 137.87గా నిలిచింది. దీంతో స్ట్రైక్ రేట్ పరంగా కోహ్లీ 52వ స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా రోహిత్ శర్మ వరుసగా 5 ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌లో ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. అంతకుముందు 2017 సీజన్‌లో రోహిత్ వరుసగా 4 ఇన్నింగ్స్‌లలో ఇలా సింగిల్ డిజిట్‌లో పెవిలియన్ చేరాడు.




