AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 Cricket: ఏడుగురు సున్నాకే ఔట్.. టోటల్ స్కోర్ 9 పరుగులే.. 4 బంతుల్లోనే మ్యాచ్ క్లోజ్..

ఫిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్ బౌలర్ల విధ్వంసం కనిపించగా, అందులో ఓ బౌలర్ 4 ఓవర్లలో 3 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

T20 Cricket: ఏడుగురు సున్నాకే ఔట్.. టోటల్ స్కోర్ 9 పరుగులే.. 4 బంతుల్లోనే మ్యాచ్ క్లోజ్..
T20 Cricket
Venkata Chari
|

Updated on: May 04, 2023 | 8:18 PM

Share

క్రికెట్ మైదానంలో ఎల్లప్పుడూ షాకింగ్ రిజల్ట్స్, సీన్స్ ఇలా ఏదో ఒకట్టి వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు భారీ స్కోర్లు నమోదవుతాయి. మరికొన్నిసార్లు స్వల్ప స్కోర్స్‌కే పరిమితమవుతుంటాయి. కొన్నిసార్లు కొత్త ఆటగాళ్ళు బీభత్సం చేస్తే.. కొన్నిసార్లు అనుభవజ్ఞులు కూడా అపజయం పాలవుతుంటారు. అయితే థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌ మధ్య మ్యాచ్‌లో ఏం జరిగిందో ఎవరూ ఊహించి ఉండరు. ఒక జట్టు 9 పరుగులు మాత్రమే చేసి జనాలకు షాకిస్తే.. మరొక జట్టు 4 బంతుల్లో ఆటను ముగించింది.

అయితే, ఈ మ్యాచ్ పెద్ద జట్ల మధ్య జరగలేదు. లేకపోతే క్రికెట్ ప్రపంచంలో సంచలనం వ్యాపించేది. ఇది క్రికెట్‌ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న చిన్న, కొత్త దేశాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్. కంబోడియాలోని పినోమ్ పెహ్న్ నగరంలో జరుగుతున్న SEA గేమ్స్ మహిళల T20 క్రికెట్ పోటీలో ఫిలిప్పీన్స్ వర్సెస్ థాయ్‌లాండ్ జట్ల మధ్య ఈ షాకింగ్ మ్యాచ్ జరిగింది.

ఇవి కూడా చదవండి

7 బ్యాట్స్‌మెన్స్ జీరోకే..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫిలిప్పీన్స్ మహిళల జట్టు 11.1 ఓవర్లు క్రీజులో నిలిచింది. అంటే 67 బంతులు ఆడింది. అయితే ఈ 67 బంతుల్లో ఫిలిప్పీన్స్ జట్టు మొత్తం 9 పరుగులకే కుప్పకూలింది. ఈ 9 పరుగులలో ఒక పరుగు వైడ్‌గా వచ్చింది. కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే జట్టు ఖాతా తెరవగలిగారు. వీళ్లంతా తలో 2 పరుగులు చేశారు.

ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆరుగురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే ఔట్ కాగా, చివరి బ్యాట్స్‌మెన్ కూడా 0 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌కు చెందిన తిపాచా పుతావాంగ్ 4 ఓవర్లలో 3 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది.

4 బంతుల్లో ఆట ముగిసింది..

థాయ్‌లాండ్ ముందు 10 పరుగుల లక్ష్యం ఉంది. థాయ్‌లాండ్‌ ఓపెనర్లు కేవలం 4 బంతుల్లోనే ఆటను ముగించారు. నత్తకన్ చంటమ్ 6 పరుగులు చేసింది.

టోర్నీలో గ్రూప్ దశలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఫిలిప్పీన్స్‌కి మలేషియాతో ప్రత్యేక మ్యాచ్‌ ఉండగా, ఆ తర్వాత మయన్మార్‌తో తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..