Viral Video: ఇంటర్‌లో మార్కులు తక్కువ వచ్చాయని ఇల్లు అద్దెకివ్వని యజమాని..
నగరాల్లో అందుబాటు ధరల్లో ఇల్లు అద్దెకు దొరకాలంటే కష్టమే. ఇక బెంగళూరు లాంటి నగరాల్లో అయితే చెప్పనక్కర్లేదు. ఇల్లు అద్దెకు కావాలంటే ఎన్నో కండిషన్లు.. బెంగళూరులో అద్దె ఇళ్లల్లో ఉండేవారి కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!
ఓ వ్యక్తి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అద్దెకు ఇల్లుకావాలని తన స్నేహితుడిని అడిగాడు. అతను ఓ మధ్యవర్తి ద్వారా ఓ ఫ్లాట్ యజమానిని సంప్రదించాడు. ప్లాట్ యజమాని సదరు వ్యక్తి లింక్డ్ ఇన్ ప్రొఫైల్, జాబ్ జాయినింగ్ లెటర్, అతని క్వాలిఫికేషన్, పాన్, ఆధార్ కార్డుల వివరాలు కావాలని కోరాడు. వామ్మో.. ఇల్లు అద్దెకు కావాలంటే ఇన్ని సమర్పించుకోవాలా అనుకుంటూ అతను అడిగినవన్నీ పంపిస్తూ తన గురించిన వివరాలు కూడా మెసేజ్ చేశాడు. రెండు రోజుల తర్వాత మధ్యవర్తిదగ్గరనుంచి తన మిత్రుడికి ఫోన్ వచ్చింది. 12వ తరగతిలో 90 శాతం మార్కులు రాకపోవడంతో ఫ్లాట్ అద్దెకు ఇవ్వనన్నాడని అతను చెప్పడంతో షాక్ తిన్నాడు. అయితే తన మిత్రుడికి కేవలం 75 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. చేసేది లేక అతను విషయం తన మిత్రుడికి తెలిపాడు. మన మార్కులు భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో తెలియదు కానీ.. బెంగళూరులో అద్దెకు ఫ్లాట్ దొరికేదీ లేనిదీ కచ్చితంగా నిర్ణయిస్తాయని చివర్లో చమత్కరిస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశాడు. ఇళ్ల బ్రోకర్‌తో జరిపిన వాట్సాప్ సంభాషణ కూడా అతడు నెట్టింట షేర్ చేశాడు. దాంతో ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!