AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hail rain: వామ్మో..! దడ పుట్టిస్తున్నవడగళ్లు.. ఏకంగా క్రికెట్‌ బాల్‌ సైజులో..

Hail rain: వామ్మో..! దడ పుట్టిస్తున్నవడగళ్లు.. ఏకంగా క్రికెట్‌ బాల్‌ సైజులో..

Anil kumar poka
|

Updated on: May 04, 2023 | 7:21 PM

Share

మండు వేసవిలో ఎండతీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఒక్క వాన చినుకు పడగానే ఎంతో ఉపశమనం కలుగుతుంది. వెంటనే ఇన్నాళ్లకు గుర్తొచ్చానా..వానా.. అంటూ పాటందుకుంటూ ఆ వర్షంలో ఎంజాయ్‌ చేస్తారు. ఇంత వరకూ బాగానే వుంది.

ఇన్నాళ్లకు గుర్తొచ్చానా..వానా.. అంటూ పాటందుకుంటూ ఆ వర్షంలో ఎంజాయ్‌ చేస్తారు. ఇంత వరకూ బాగానే వుంది. ఆ వాన కాస్తా వడగళ్ల వానగా మారితే.. మరింత ఆనందం.. ఆకాశం నుంచి ఐస్‌ ముక్కలు నేలరాలుతుంటే వాటిని చేతుల్లోకి తీసుకొని చూస్తుండగానే అవి కరిగిపోతుంటే మనసు ఎంతో పులకిస్తుంది. కానీ ఈ వర్షం పరిమితి దాటిందంటే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి వడగండ్ల వర్షానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలోని ఓ ప్రాంతంలో వడగళ్ల వాన కురుస్తోంది. ఆకాశం నుంచి రాలిపడుతున్న ఆ వడగళ్ల పరిమాణం చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అవి ఏకంగా క్రికెట్‌ బాల్‌ అంత పరిమాణంలో ఉన్నాయి. అవి ఎంత వేగంగా పడుతున్నాయంటే…ఒక ఇంటిపై పడుతున్న వాటిని చూస్తుంటే ఆ ఇల్లు పడిపోతుందేమోనని అనిపిస్తుంది. ఈ వీడియోను ఒక నెటిజన్‌ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌చేశారు. ఈ వీడియోను ఇప్పటికే నాలుగున్నర కోట్ల మంది వీక్షించారు. లక్షలమంది లైక్‌ చేశారు. కాగా వీడియో షేర్‌ చేసిన వ్యక్తి కామెంట్స్‌ సెక్షన్‌ ఆఫ్‌ చేయడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలు తెలపలేకపోయారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!