Bhadrachalam: ‘కళ తప్పిన భద్రాద్రి పర్ణశాల.. శిధిలావస్థలో సీతారాముల విగ్రహాలు’ పట్టించుకునే నాథుడే లేరని భక్తుల ఆవేదన
శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న దుమ్ముగూడెం మండలం వర్ణశాల పుణ్యక్షేత్రం భక్తులను పరవశింపజేస్తుంది.ఆకట్టుకునే చారిత్రాత్మక ఆనవాళ్ళు.. ఆహ్లాదకరవాతావరణంలో పర్ణశాల పుణ్యక్షేత్రం.. ఇలా రామాయణ ఘట్టాలను జ్ఞాప్తికి తెచ్చే దృశ్యాలు భద్రాచలంలో కోకొల్లలు. పర్ణశాలలోని వెలసి ఉన్న సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రస్వామి వారి దేవాలయానికి అనేక ప్రాంతాల నుంచి నిత్యం భక్తులు సందర్శించి స్వామి వారిని..
భద్రాచలం, జనవరి26: శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న దుమ్ముగూడెం మండలం వర్ణశాల పుణ్యక్షేత్రం భక్తులను పరవశింపజేస్తుంది.ఆకట్టుకునే చారిత్రాత్మక ఆనవాళ్ళు.. ఆహ్లాదకరవాతావరణంలో పర్ణశాల పుణ్యక్షేత్రం.. ఇలా రామాయణ ఘట్టాలను జ్ఞాప్తికి తెచ్చే దృశ్యాలు భద్రాచలంలో కోకొల్లలు. పర్ణశాలలోని వెలసి ఉన్న సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రస్వామి వారి దేవాలయానికి అనేక ప్రాంతాల నుంచి నిత్యం భక్తులు సందర్శించి స్వామి వారిని దర్శిందుకుంటుంటారు. పవిత్ర గోదావరి నదీ తీరంలో సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు వెలసిన పుణ్యక్షేత్రం వర్ణశాల. ఎందరో ఋషులు, మునులు, యోగులకు నిలయమైన ఈ చోటుకి తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞను తలవాల్చి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. ఆ వనవాస కాలంలో చివరి రెండున్నర సంవత్సరాలు వర్షకాలలో గడిపినట్లు పురాణాలు చెపుతున్నాయి.
దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధిగాంచిన భద్రాచల సీతారామచంద్రస్వామి అలయానికి అనుబంధమైన ఆలయమైన పర్ణశాల పుణ్యక్షేత్రానికి నిత్యం భక్తులు భారీగా తరలివస్తుంటారు. రాముడు వనవాసం చేసిన సమయంలో పర్ణశాలలో ఏర్పాటు చేసుకున్న పర్ణశాల పంచవటి కుటీరం, రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు అర్థమయ్యే రీతిలో ఏర్పాటు చేసిన సీతరామ లక్ష్మణుల శిల్పాలు, అలాగే మారువేషంలో వచ్చి సీతమ్మను అపహరించడానికి వచ్చిన రావణాశురిడి శిల్పాలు చూడటానికి వచ్చిన భక్తులలో దైవం ఉట్టిపడేలా ఉండేవి.
అంతటి రామాయణ చారిత్రక గల పర్ణశాల కుటీరంలోని శిల్పాలు విరిగిపోయి కలతప్పి, కళా హీనంగా ఉండటంతో ఎంతో భక్తితో వచ్చిన రామ భక్తులు అట్టి శిల్పాలను చూసి అయ్యో రామ అంటూ భాదపడుతూ ఆలయ అధికారులపై మండిపడుతున్నారు. ఎంతో చరిత్ర విశిష్ఠత కలిగిన పర్ణశాల ఆలయం అభివృద్ధి, సీతారాముల కుటీరం, విగ్రహాలను బాగు చేయడంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు స్పందించి పగిలి, విరిగిపోతున్న శిల్పాలకు మరమ్మతులు చేపించి పూర్వ వైభవం తీసుకు రావాలని భక్తులు కోరుతున్నారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.