AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌కు ఇకపై ఈ ప్రాంతాలే హాట్ కేకులు.. మరో కోకాపేట కావడం పక్కా.!

గ్రేటర్ హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తుంది. గడచిన రెండు దశాబ్దాలుగా వెస్ట్ జోన్‌లో భారీ అభివృద్ధి చూసిన రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఈస్ట్‌జోన్ వైపు చూస్తోంది. 'లుక్ ఈస్ట్' పేరుతో ప్రభుత్వం చూపిన చొరవతో రియల్ సంస్థలు అటువైపు ఫోకస్ చేశాయి.

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌కు ఇకపై ఈ ప్రాంతాలే హాట్ కేకులు.. మరో కోకాపేట కావడం పక్కా.!
Real Estate
Vidyasagar Gunti
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 26, 2024 | 12:33 PM

Share

హైదరాబాద్‌/ఈస్ట్ జోన్, జనవరి 26: గ్రేటర్ హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తుంది. గడచిన రెండు దశాబ్దాలుగా వెస్ట్ జోన్‌లో భారీ అభివృద్ధి చూసిన రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఈస్ట్‌జోన్ వైపు చూస్తోంది. ‘లుక్ ఈస్ట్’ పేరుతో ప్రభుత్వం చూపిన చొరవతో రియల్ సంస్థలు అటువైపు ఫోకస్ చేశాయి. ఇప్పటికే పెరిగిన రోడ్ కనెక్టివిటీకి తోడు ఎయిర్ పోర్టు మెట్రో అలైన్‌మెంట్ ఇటు తిరగడంతో ఈస్ట్ జోన్ దశ తిరగబోతోంది. స్థిరాస్తి పెట్టుబడులకు గ్రేటర్ ఈస్ట్ జోన్ మంచి సెంటర్ అవుతోంది. హైదరాబాద్ నగరంలో ఓ ఇళ్లు కొనుగోలు చెయ్యాలనేది సగటు సామాన్యుడి కల. అద్దె ఇంట్లో ఉండలేక.. ఆ అవస్థలు పడలేక అప్పు చేసైనా, బ్యాంకు లోన్ తీసుకునైనా ఓన్ హౌస్ కొనాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేయడం లక్షల రూపాయలతో కూడిన వ్యవహారం. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ తక్కువ ధరకు భూమి దొరుకుతుంది.? ఎక్కడ పెట్టుబడి పెడితే ఆ సొమ్ముకు మంచి రిటర్న్స్ వస్తాయి అని ఆలోచిస్తున్నారు జనం. అంతే కాకుండా భవిష్యత్తుకు మంచి భరోసా ఉంటుందా.? లేదా.? అనే కోణంలో ప్లాన్ చేస్తున్నారు.

మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, చందానగర్, మణికొండ, నార్సింగి, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, ఔటర్ రింగ్ రోడ్డు వరకు వెస్ట్ జోన్‌లో రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యింది. అనేక నివాస వాణిజ్య సముదాయాలు, ఐటీ సంస్థలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న భూముల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. అక్కడ కొనే పరిస్థితి లేదు. సేల్‌కు అందుబాటులో ప్లాట్లు లేవు. ఇప్పుడు ఫోకస్ అంతా ఈస్ట్‌కు మళ్లింది. రానున్న భారీ ప్రాజెక్టులు, అందుబాటులో విశాల స్థలం, మంచి మౌలిక వసతులు కలిగిన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గుడ్ ఆఫ్షన్‌గా ఈస్ట్ సిటి మారిందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్ తూర్పు భాగంలో ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తీసుకువచ్చేలా ప్రభుత్వం ‘లుక్ ఈస్ట్’ పాలసీ తీసుకువచ్చింది. వరంగల్ హైవే వైపు ఇండస్ట్రియల్ కారిడార్ వంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, హయత్ నగర్, పోచారం వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అబివృద్దికి చాలావరకు చాన్స్ ఉంది. ఉప్పల్ భగాయత్‌లో హెచ్ఎండిఏ డెవలప్ చేసిన ప్రాంతంలో జరుగుతున్న రియల్ డెవలప్మెంట్ ఈస్ట్ జోన్‌లో స్థిరాస్తికి ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో వాణిజ్యపరమైన ఆస్తులను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. వెస్ట్ జోన్‌తో పోల్చినప్పుడు తక్కువ ధరకు ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసేకుందుకు అవకాశం ఉందని అంటున్నారు.

ఇక ఈస్ట్ జోన్‌లో ఇప్పటికే నాగోల్, ఎల్‌బి నగర్ వరకు మెట్రో రైల్ అందుబాటులో ఉంది. ఉప్పల్ సమీపంలో భగాయత్ లే అవుట్, మెట్రో డిపో వద్ద వాణిజ్య సముదాయాలకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎస్ఆర్డిపిలో భాగంగా అనేక జంక్షన్లు ట్రాఫిక్ ఫ్రీ అయ్యాయి. మెట్రో విస్తరణ ఇప్పుడు ఈస్ట్‌కు బూస్ట్ ఇవ్వబోతుంది. దీంతో లుక్ ఈస్ట్.. లుక్స్ గ్రేట్‌గా మారబోతుంది.