Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు.. అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరు..!
ఇంతకీ అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది? కవిత దీక్షకు సిద్ధమవుతున్న టైమ్‌లోనే ఈ అంశం తెరపైకి ఎందుకొచ్చింది.. మరిన్ని కీలక విషయాలు ఈ వార్తలో తెలుసుకుందాం..

ఇంతకీ అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది? కవిత దీక్షకు సిద్ధమవుతున్న టైమ్‌లోనే ఈ అంశం తెరపైకి ఎందుకొచ్చింది.. మరిన్ని కీలక విషయాలు ఈ వార్తలో తెలుసుకుందాం..
లిక్కర్ స్కామ్ జరిగింది ఢిల్లీలో అయినా దర్యాప్తు మొత్తం తెలుగు రాష్ట్రాల చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అటు సీబీఐ ఇటు ఈడీ పలువురు ప్రముఖులను అరెస్ట్ చేశాయి. దర్యాప్తుని మరింత ముమ్మరం చేశాయి. ఈకేసులో అఫ్రూవర్‌గా మారిన అమిత్ అరోరాపై వేసిన రిమాండ్ రిపోర్టులో తొలిసారి ఎమ్మెల్సీ కవిత పేరు వినిపించింది. ఇప్పుడు రామచంద్రపిళ్లైపై ఈడీ వేసిన రిమాండ్ రిపోర్టులోనూ మరోసారి పదేపదే కవిత పేరును ప్రస్తావించింది. పైగా ఆమెకు పిళ్లై బినామీగా ఉన్నారంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది.
ఈనెల 10వ తేదీన మహిళా బిల్లుకోసం ఢిల్లీలో దీక్షకు సిద్ధమయ్యారు కవిత. ఈలోపే లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్ రావడం హాట్‌టాపిక్ అయ్యింది. అయితే ఈ వేధింపులు రాజకీయ కుట్రలో భాగమేనని.. ఆధారాలుంటే ఎందుకు అరెస్ట్ చేయడంలేదని టీవీ9 క్రాస్‌ఫైర్ ప్రోగ్రామ్‌లో ప్రశ్నించారు కవిత.




కవిత తరపున సౌత్ గ్రూప్‌లో పిళ్లై ఇన్వెస్ట్ చేశారని ఈడీ చెప్పడం సంచలనంగా మారింది. అయితే రామచంద్ర పిళ్లైతో తనకు పరిచయం ఉన్నమాట వాస్తవమే అంటున్నారు కవిత. అలాగని స్నేహితులు చేసే వ్యాపారాలను కూడా అంటగడితే ఎలా? దానితో తనకేం సంబంధం అని నిలదీశారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఓసారి కవితను ప్రశ్నించింది సీబీఐ. గత ఏడాది డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సుమారు 7 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి కేవలం సాక్షిగానే విచారించారు. అవసరమైతే భవిష్యత్‌లో మళ్లీ ప్రశ్నిస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు రామచంద్రపిళ్లైపై ఈడీ వేసిన రిమాండ్ రిపోర్టులోనూ కవిత పేరును పదేపదే ప్రస్తావించడం.. పైగా రామచంద్రపిళ్లైని కవిత బినామీగా పేర్కొనడంతో.. త్వరలోనే మరోసారి నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
