Telangana: సాత్విక్‌ సూసైడ్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు.. ఎంత ఘోరంగా వేధించారో తెలిస్తే కన్నీరాగదు..!

నార్సింగి శ్రీచైతన్యం కాలేజీలో సూసైడ్ చేసుకున్న విద్యార్థి సాత్విక్‌ సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు సబ్‌మిట్‌ చేసిన 22 పేజీల రిమాండ్‌ రిపోర్ట్‌‌లో గుండెలవిసే అంశాలు పేర్కొన్నారు.

Telangana: సాత్విక్‌ సూసైడ్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు.. ఎంత ఘోరంగా వేధించారో తెలిస్తే కన్నీరాగదు..!
Satwik Student
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 07, 2023 | 11:20 AM

నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో సూసైడ్ చేసుకున్న విద్యార్థి సాత్విక్‌ సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు సబ్‌మిట్‌ చేసిన 22 పేజీల రిమాండ్‌ రిపోర్ట్‌‌లో గుండెలవిసే అంశాలు పేర్కొన్నారు. ఈ రిపోర్ట్ ఇప్పుడు టీవీ9కి చిక్కింది. అతని సూసైడ్‌ నోట్‌ని ఆధారంగా చేసుకుని జరిగిన దర్యాప్తులో A1గా ప్రిన్సిపాల్ ఆచార్య, A2గా కృష్ణారెడ్డి, A3గా వార్డెన్ నరేష్‌, A4గా జగన్ అనే మరో అద్యాపకుడు ఉన్నారు. వీళ్లు నలుగురూ పనికట్టుకుని సాత్విక్‌ని వేధించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో తేలింది.

రిమాండ్ రిపోర్ట్‌లోని సంచలన వివరాలివే..

A1గా ఉన్న అడ్మిన్‌ ప్రిన్సిపాల్ ఆచార్య.. సాత్విక్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడేవాడు. ఆస్తులు అంతస్థులు ఉంటే ఏం పీకుతావ్‌రా అంటూ సాత్విక్‌ని దుర్భాషలాడేవాడు. నువ్ వాచ్‌మెన్‌కి అసెస్టెంట్‌గా కూడా పనికిరావంటూ హేళన చేసేవాడు ప్రిన్సిపాల్. ఇక A2గా ఉన్న ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి కులంపేరుతో దూషించేవాడన్నది రిమాండ్‌ రిపోర్ట్‌లో ఉన్న సారం. షాద్‌నగర్ శాలోడా అంటూ కించపరిచేవాడని తెలుస్తోంది.

ఇక తానేమీ తీసిపోలేదన్నట్లు ప్రవర్తించేవాడు A3గా ఉన్న వార్డెన్ నరేష్. సాత్విక్ స్నానం చేసేటప్పుడు నరేష్‌ వాటర్ ఆపేసేవాడు. మంచినీళ్లు తాగుతున్నప్పుడు గ్లాస్‌, బాటిల్ లాక్కునేవాడు. తన కింద బానిసగా ట్రీట్‌ చేసేవాడు వార్డెన్. ఇక A4గా ఉన్నది వైస్‌ ప్రిన్సిపాల్‌ జగన్. చదువుపరంగా ఏ చిన్న తప్పు జరిగినా, మార్కులు తక్కువ వచ్చినా ఐదారు గంటలపాటు నిలబెట్టేవాడాయన. నిలబెట్టడమే కాదు.. తల్లిదండ్రులను ఉద్దేశించి దుర్భాషలాడేవాడు. వీటన్నింటి ప్రతిఫలమే.. సాత్విక్ సూసైడ్‌ అన్నది రిమాండ్‌ రిపోర్ట్‌ ద్వారా తెలుస్తున్న విషయం. అయితే తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తన సోదరుడికి సాత్విక్ చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ.. వారి వేధింపులు ఆగలేదని, సాత్విక్ మాదిరిగానే మిగతా విద్యార్థులను కూడా వీరు వేధించేవారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..