TSRTC: టీఎస్ఆర్టీసీ అద్దిరిపోయే ఐడియా.. మరి ఆదాయం రెట్టింపయ్యేనా? వివరాలివే..!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో ఆర్టీసీ తెలంగాణ ఉద్యోగుల పాత్ర ఎనలేనిదనే చెప్పాలి. పోరాటం ఫలించింది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్..

TSRTC: టీఎస్ఆర్టీసీ అద్దిరిపోయే ఐడియా.. మరి ఆదాయం రెట్టింపయ్యేనా? వివరాలివే..!
TSRTC Special Busses
Follow us

|

Updated on: Mar 07, 2023 | 12:35 PM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో ఆర్టీసీ తెలంగాణ ఉద్యోగుల పాత్ర ఎనలేనిదనే చెప్పాలి. పోరాటం ఫలించింది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. ఆర్టీసీని లాభాల పట్టించేందుకు అనేక రకాల చర్యలు చేపట్టారు అందులో భాగంగానే.. కొత్త కొత్త ప్రయోగాలకు తెరలేపారు. నష్టాల నుంచి గట్టెక్కి.. లాభాల పట్టించేందుకు ఆర్టీసీ పార్శిల్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఆ తరువాత ప్రయాణికులకు ఆర్టీపై నమ్మకం కలిగించేందుకు, ఆర్టీసీ ప్రయాణమే చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. అవి ఫలితాలను కూడా ఇస్తున్నాయి.

ఇక ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీకి అదనపు ఆదాయం వచ్చేలా బస్ స్టేషన్‌లలో పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది యాజమాన్యం. జిల్లాల్లో, మండలాల్లో నిరుపయోగంగా, ప్రయాణికులు రాని బస్ స్టేషన్లలో ఈ పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది ఆర్టీసీ యాజమాన్యం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 9 పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఆర్టీసీ. అయితే, ప్రతిపాదనను ఆయిల్‌ కంపెనీ ప్రతినిధులు కూడా పరిశీలించారు. ఇక పెట్రోల్ బంకులను 3 విధాలుగా ఏర్పాటు చేయనున్నారు.

మొదటి విధానంలో పూర్తిగా కంపెనీలకు అప్పగించి అద్దె రూపంలో ఆదాయం తీసుకోవడం. రెండవ విధానంలో ఆర్టీసీ ద్వారానే బంకు నిర్వహించుకోవడం. మూడవ విధానంలో ప్రైవేటు అవుట్‌ లెట్ల మాదిరిగా నడిపించాలని యోచిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు చోట్ల బస్‌స్టేషన్‌లు నిరుపయోగంగా ఉన్నాయి. గ్రామాల మధ్యలో రోడ్డు పక్కనే ఉన్నా.. ప్రయాణికులు రాకపోవడంతో అవి వెలవెలబోతున్నాయి. దీనివల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోంది. వీటిని ఎందుకు వృథాగా వదిలేయాలని భావించిన ఆర్టీసీ.. పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..