Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: నీటితోనే డయాబెటిస్‌ కంట్రోల్‌ చేయొచ్చు.. అదెలాగంటే.. వివరాలు మీకోసం..

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ప్రధానంగా చాలా మంది ఫేస్ చేసే సమస్యలు డయాబెటిస్.

Diabetes: నీటితోనే డయాబెటిస్‌ కంట్రోల్‌ చేయొచ్చు.. అదెలాగంటే.. వివరాలు మీకోసం..
Drinking Water
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 07, 2023 | 1:40 PM

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ప్రధానంగా చాలా మంది ఫేస్ చేసే సమస్యలు డయాబెటిస్. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఒకసారి వచ్చిందంటే.. జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే, ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, పని వంటి అనేక విషయాలు ఉంటాయి. అయితే, డయాబిటెక్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది మెడిసిన్స్ నుంచి ఆయుర్వేదం వరకు అన్నింటిని అనుసరిస్తారు. అయితే, డయాబెటిక్ బాధితులు.. ఈ మందుల వినియోగంతో పాటు.. మంచి నీటిని తాగడం వల్ల కూడా బ్లడ్ షుగర్‌ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో అవసరానికి మించి ఉండే గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నందున.. చాలా జాగ్రత్తగా ఉండాలని, నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి నీటిని ఏ విధంగా తీసుకోవాలి? ఏ సమయంలో తాగాలి? ఎంత మోతాదులో తాగాలి? వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భోజనానికి ముందు నీరు తాగాలి..

డయాబెటిస్ బాధితులు భోజనానికి ముందు నీళ్లు తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ ఇంట్లో కాకుండా బయట తిన్నాసరే.. నీటిని తాగాలని సూచిస్తున్నారు. అల్పాహారం చేసే సమయంలోనూ అనేకసార్లు నీళ్లు తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాంటి ఆహారమే తీసుకోవాలి..

మధుమేహ బాధితులు తాము రోజూ తీసుకునే ఆహారం నీటిశాతం అధికంగా ఉండే పదార్థాలనే తీసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా శరీరానికి నీరు అందడమే కాకుండా.. శక్తి కూడా అందుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఎప్పుడూ నీళ్ల బాటిల్ వెంట ఉండాల్సిందే..

మధుమేహం బారిన పడిన వారు నిత్యం తమ వెంట నీళ్ల బాటిల్‌ను తీసుకెళ్లాలి. బయటకెళ్లినప్పుడు.. అప్పుడప్పుడు నీటిని తాగాలి. తద్వారా డీహైడ్రేట్ సమస్య తలెత్తదు.

రిమైండర్లు పెట్టుకోవాలి..

చాలా మంది ప్రజలుు పనిలో పడి నీళ్లు తాగడం మర్చిపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో స్మార్ట్ వాచీ, స్మార్ట్ ఫోన్లలో రిమైండర్లను పెట్టుకోవాలి. అలా నీటిని గంటకో, అర్థగంటకో ఒకసారి తాగాలి.

కాస్త భిన్నంగా..

ఎవరికైనా సరే సాధారణ నీటిని పదే పదే తాగడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఆ వాటర్‌లో నిమ్మకాయ గానీ, దోసకాయ, ఇతర పండ్ల ముక్కలను కలుపుని తాగొచ్చు. ఇది కాస్త టేస్టీగా ఉండటంతో పాటు.. అధికంగా నీటిని తాగేందుకు ఉపకరిస్తుంది.

వాటలర్ లెవల్స్ ట్రాకింగ్..

అసలే ఎండాకాలం. ఈ సీజన్‌లో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. అందుకే.. శరీరంలో నీటి శాతం ఎంత ఉందో నిరంతరం ట్రాక్ చేస్తుండాలి. దీని వల్ల డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది.

గమనిక: పైన తెలిపిన సమాచారం కేవలం ప్రజల సాధారణ సమాచారం కోసం మాత్రమే. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఈ విషయంలో ముందుగా వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనలు పాటించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..