AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. అది విటమిన్ డీ లోపం కావచ్చు! వెంటనే చెక్ చేసుకోండి..

వయసుతో సంబంధం లేకుండా ఎక్కువమంది విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణం రోజు రోజుకు ఎండకు దూరంగా జీవించడమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డీ లోపాన్ని ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఏర్పడవు.

Vitamin D Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. అది విటమిన్ డీ లోపం కావచ్చు! వెంటనే చెక్ చేసుకోండి..
Vitamin D
Madhu
|

Updated on: Mar 07, 2023 | 1:35 PM

Share

ఇంట్లో ఏసీ.. కారులో ఏసీ.. ఆఫీసులో ఏసీ.. శరీరానికి ఎండ తగిలితే ఒట్టు! ప్రస్తుత జనరరేషన్ ఇలాగే ఉంది. కొంచెం సమయం కూడా శరీరానికి ఎండతగడం లేదు. సూర్యరశ్మికి దూరంగా జీవించడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో ఎక్కువమంది డీ విటమిన్ లోపంతో రోగాల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎక్కువమంది విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణం రోజు రోజుకు ఎండకు దూరంగా జీవించడమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డీ లోపాన్ని ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఏర్పడవు. ఈ నేపథ్యంలో విటమిన్ డీ లోపాన్ని గుర్తించడలం ఎలా? శరీంలో ఈ విటమిన్ లోపించినప్పుడు కనిపించే లక్షణాలు ఏవి? ఓ సారి చూద్దాం..

ప్రతి విటమిన్ కూడా అవసరమే..

నిజానికి మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే అన్ని విటమిన్లు ఉండాల్సిందే.. ఏ విటమిన్ లోపం ఏర్పడినా.. ఏదొక వ్యాధిబారిన పడతారు. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి డీ విటమిన్ గురించి ఎక్కువగా వినిపిస్తుంది. కండ‌రాలు బ‌లంగా ఉండాల‌న్నా, ఎముకలకు అవసరమైన క్యాల్షియంను శ‌రీరం గ్ర‌హించాల‌న్నా, ఇన్ఫెక్షన్ల బారిన ప‌డ‌కుండా ఉండాల‌న్నా, మెద‌డు స‌రిగ్గా ప‌ని చేయాల‌న్నా, రోగ నిరోధక వ్యవస్థ స్ట్రోంగ్‌గా ఉండాల‌న్నా విట‌మిన్ డి ఎంతో అవ‌స‌రం. ఈ విటమిన్ సహజంగా లభిస్తుంది. చర్మానికి సూర్యరశ్మి తగిలినపుడు విటమిన్ డి తయారవుతుంది. అంతేకాకుండా, మీరు కొన్నిరకాల ఆహార పదార్ధాల నుండి కూడా విటమిన్ డి ను పొందవచ్చు. విటమిన్ డి ని శరీరానికి తగినంత పరిమాణంలో అందివ్వగలగాలి. విటమిన్ డి ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలోనే కాకుండా, తినే ఆహారం నుండి కాల్షియం శోషించడంలో కూడా సహాయపడుతుంది. ఫ్లూ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు తేల్చాయి. ఇది సరైన మోతాదులో శరీరానికి అందకపోతే అనేక శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. పసిపిల్లల నుండి, పెద్ద వారిదాకా ఈ సమస్య ఎవరినైనా వేధించవచ్చు. దీని కారణంగాచర్మ సంబంధ సమస్యలు, జుట్టు రాలడం వంటివే కాకుండా, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి.

ఎంత డీ విటమిన్ కావాలి..

సగుటున ఒక వ్యక్తికి రోజుకు 1500 నుంచి 2000 ఇంటర్నేషన్ యూనిట్స్(ఐయూ)ల విటమిన్ డీ అవసరం అవుతుంది. ఇది సాధారణంగా సూర్యరశ్మి ద్వారా మనకు అందుతుంది. అలాగే పాల ఉత్పత్తులు, చేపలు వంటి ఆహార పదార్థాల నుంచి కూడా శరీరానికి అందుతుంది. శరీరానికి ఇది సరిపడా అందకపోతే ఈ లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. వీటిని గమినించినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

ఇవి లక్షణాలు..

చిన్న పనికే కండరాలు నొప్పులు, అలసట, ఎముకల్లో బలహీనత, ఎముకల నొప్పి, జాయింట్ల వద్ద నోప్పి, పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతారు. వారి కండరాలు బలహీన పడి నొప్పిన అనుభవిస్తారు. వెన్ను నొప్పి, ఏదైనా గాయం అయినప్పుడు త్వరగా తగ్గకపోవడం, జుట్టు ఊడిపోవడం, డిప్రెషన్, ఆందోళన, యాంగ్జైటీ వంటివి వేధిస్తాయి.

ఇలా చేయాలి..

ఉదయం, సాయంత్రం ఎండలో ఒక గంట నిల్చోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక తినే ఆహారంలో కోడి గుడ్డు, చేపలు, రొయ్యలు, చీజ్, పన్నీర్, పెరుగు వంటి పాల పదార్థాలు, బాదాం, గోధుములు, రాగులు, ఓట్స్, పుట్టగొడులను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఆహారపదార్ధాల్లో డి విటమిన్ ఉంటుందని వివరిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..