మీ వయస్సు 50 దాటిందా…డిమెన్షియా వస్తుందేమోనని భయమా..అయితే ఈ 5 చిట్కాలు మీకోసం..
వయస్సు పెరిగే కొద్ది మతిమరుపు పెరగడం సహజమే, దీనికి ప్రధాన కారణం డిమెన్షియా జబ్బు, అయితే వ్యాధిని కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు.

వయస్సు పెరిగే కొద్ది మతిమరుపు పెరగడం సహజమే, దీనికి ప్రధాన కారణం డిమెన్షియా జబ్బు, అయితే వ్యాధిని కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. అలాంటి చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. బోస్టన్‌లోని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ విభాగం వారు డిమెన్షియా పై ఆధారపడిన అధ్యయనం ఫలితాలు సమర్పించారు. డిమెన్షియా గురించి మనం తెలుసుకోవలసిన అసలు విషయం ఏమిటంటే, మీ అలవాట్లు మీ డిమెన్షియా ప్రమాదాన్ని మరింత ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
ఈ పరిశోధనలో శుభవార్త ఏమిటంటే, మధ్యవయస్సులో ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వ్యక్తులు డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. వృద్ధులకు డిమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 65 ఏళ్లు పైబడిన వారిలో 5% నుండి 8% మంది ఏదో ఒక రకమైన డిమెన్షియాతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచంలో 55 మిలియన్ల మంది ప్రజలు డిమెన్షియా తో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. డిమెన్షియా రిస్క్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగే 5 అలవాట్లను గురించి తెలుసుకుందాం.
బెర్రీ పండ్లు తినడం వల్ల డిమెన్షియా రిస్క్ తగ్గుతుంది:




ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పౌష్టికాహారం చాలా ముఖ్యం. బెర్రీస్ తినడం వల్ల డిమెన్షియా, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ కాంపౌండ్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.
డిమెన్షియాకు విటమిన్ డి కనెక్షన్:
డిమెన్షియాతో బాధపడుతున్న వ్యక్తి జ్ఞాపకశక్తి బలహీనంగా ఉంటుంది. దీంతో రోజువారీ పనులు చేసుకోలేకపోతారు. విటమిన్ డి లోపంతో 60 ఏళ్లు పైబడిన వారిలో మానసిక బలహీనత పెరుగుతుందని పరిశోధనలో వెల్లడైంది. అందుకే విటమిన్ డి లోపం ఉండకూడదు. విటమిన్ డి ప్రధాన మూలం సూర్యకాంతి. విటమిన్ డి డిమెన్షియా ప్రమాదాన్ని 33 శాతం తగ్గిస్తుంది.
బరువును అదుపులో ఉంచుకోండి:
ఆరోగ్యంగా ఉండటానికి సులభమైన మార్గం మీ బరువును అదుపులో ఉంచుకోవాలి. మీరు మీ పెరుగుతున్న బరువును కూడా నియంత్రించాలనుకుంటే, మీ రోజును గోరువెచ్చని నీటితో ప్రారంభించండి. బరువు అదుపులో ఉండాలంటే ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. ప్రాసెస్ చేసిన వేయించిన ఆహారం మీ బరువును పెంచుతుంది. రాత్రి సమయానికి నిద్రపోవాలి.
వారానికి 5 రోజులు 30 నిమిషాలు యోగా చేయాలి:
శారీరక శ్రమ డిమెన్షియా ప్రమాదాన్ని 50 శాతం తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరూ వారానికి 5 రోజులు కనీసం 30 నిమిషాలు లేదా 45 నిమిషాలు వ్యాయామం చేయడం అవసరం. దీని వల్ల శరీరంలో అన్ని విధులు సజావుగా సాగుతాయి.
మధుమేహం రక్తపోటు నియంత్రణలో ఉంచడం:
మధుమేహం ఉన్నవారిలో డిమెన్షియా వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువ. కాబట్టి అలాంటి వారు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యం సేవించడం వల్ల బీపీ పెరుగుతుంది. అందుకే ధూమపానానికి దూరంగా ఉండండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)