AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: 20 ఏళ్లకే ముప్పు.. ఉన్నట్టుండి ప్రాణాలు పొతున్నాయ్.. గుండె జర భద్రం గురూ..

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న హార్ట్ ఎటాక్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో 24గంటల్లోనే గుండెపోటుతో నలుగురు మృతి చెందారు.

Heart Attack: 20 ఏళ్లకే ముప్పు.. ఉన్నట్టుండి ప్రాణాలు పొతున్నాయ్.. గుండె జర భద్రం గురూ..
Heart Attack
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 06, 2023 | 9:46 AM

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న హార్ట్ ఎటాక్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో 24గంటల్లోనే గుండెపోటుతో నలుగురు మృతి చెందారు. టీవీ9 మారథాన్ చర్చా వేదికలో హార్ట్ స్టోక్ పై నిపుణులు పలు సూచనలు చేశారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే యువ గుండెలు ఆగిపోతున్నాయి. ముప్పైఏళ్లకే గుండెముప్పుతో ప్రాణాలు విడుస్తున్నారు. బండరాళ్లను సైతం పిండిచేసే కండలున్నా.. గుండెలు సైతం బలహీనంగా మారుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. గుండెపోటుతో ఇంటర్ సెకండియర్ విద్యార్థి ప్రాణాలు విడిచాడు. బోనకల్ మండలం బ్రహ్మణపల్లికి చెందిన 18 ఏళ్ల రాకేష్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రెండ్స్ తో సరదాగా ముచ్చటిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు.

కామారెడ్డి, కరీంనగర్, వరంగల్ లోనూ..

కామారెడ్డి జిల్లాలోను గుండెపోటుతో మరో వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై వెళ్తుండగా సెడన్ గా హార్ట్ స్టోక్ కు గురయ్యాడు. ఇటీవలే గల్ఫ్‌ నుంచి గాంధారికి వచ్చిన షేక్‌ అహ్మద్‌ గుండెపోటుతో మృతి చెందాడు. అహ్మద్ చాలా ఆరోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు అతని ఫ్రెండ్స్‌. ఇక కరీంనగర్ లోను సేమ్ సీన్ రిఫీట్ అయింది. లిఫ్ట్ ఎక్కుతుండగా గుండెపోటుకు గురైన ఓవ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు. వరంగల్ జిల్లా కేంద్రంలోను గుండెపోటుతో ఓవ్యక్తి మృతిచెందాడు. బస్టాండ్ లో హార్ట్ స్టోక్ తో చనిపోయాడు. దీంతో 24 గంటల్లో ఒక్క తెలంగాణలోనే నలుగురు వ్యక్తులు హార్ట్ ఎటాక్ తో చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది.

అసలు ఎన్నడు లేనిది ఈమధ్య కాలంలోనే ఎందుకీ పరిస్థితి? అనే దానిపై మారథాన్‌ చర్చ నిర్వహించింది టీవీ9. దీంట్లో రెండు అంశాలు చర్చకు వచ్చాయి. గుండె ఎందుకు బలహీనపడుతోంది. యంగ్ ఏజ్‌లోనే హార్ట్‌ ఎటాక్‌ ఎందుకొస్తుంది? అనే దానిపై తీవ్ర చర్చ జరిగింంది. గుండె పదిలం అవ్వాలంటే.. సమర్థంగా పనిచేయాలంటే ఏం చేయాలి? అనే దానిపై నిపుణులు తమ తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు.

ఇవి కూడా చదవండి

అలెర్ట్ అవ్వాల్సిందే..

లైఫ్‌స్టైల్‌ సమస్యలతో పాటు.. కోవిడ్‌ సమయంలో మితిమీరివాడిన స్టెరాయిడ్స్‌.. ఇప్పుడు ప్రాణాలను బలితీసుకుంటున్నాయనే అభిప్రాయం చాలా మందినుంచి వినిపించింది. అతిగా వాడిన యాంటిబయాటిక్స్‌, విటమిన్‌ టాబ్లెట్స్‌ కూడా కారణమరి చెప్పారు నిఫుణులు. వాటి దుష్ఫలితాల నుంచి బయటపడాలంటే నిత్యం వ్యాయామం చేయడం అవసరమని.. సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమని సూచించారు. కావున ప్రతి ఒక్కరూ నిఫుణుల సూచనలు పాటించి.. బీకేర్‌ఫుల్ గా ఉండాలని సూచిస్తుంది టీవీ9.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..