Soaked Foods: ఈ 5 పదార్థాలను నానబెట్టి తింటే చాలు.. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్లే..!
ఆరోగ్య సంరక్షణ కోసం కొన్ని రకాల పదార్ధాలను నానబెట్టుకుని తినాలని. అలా చేయడం వల్ల ఎటువంటి సమస్య మన దరి చేరదని నిపుణులు అంటున్నారు. మరి..
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్యకరమైన జీవన విధానం, ఆహారపు అలవాట్లు చాలా అవసరం. ముఖ్యంగా నిత్యం పోషకాలతో కూడిన ఆహారాన్ని తినడం ద్వారా దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అందుకే ఎప్పుడూ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణ కోసం కొన్ని రకాల పదార్ధాలను నానబెట్టుకుని తినాలని. అలా చేయడం వల్ల ఎటువంటి సమస్య మన దరి చేరదని నిపుణులు అంటున్నారు. మరి వారి సూచనల మేరకు ఏయే పదార్థాలను నానబెట్టి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం: ప్రతీ రోజూ నానబెట్టిన బాదం పప్పులను తింటే, అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నానబెట్టిన బాదం అధిక రక్తపోటు చికిత్సలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మెంతులు: మెంతి గింజల్లో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నానబెట్టిన మెంతులు మధుమేహ రోగులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
ఎండుద్రాక్ష: నానబెట్టిన ఎండుద్రాక్షలో అధిక ఐరన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక చర్మ సమస్యలకు మేలు చేస్తుంది.. అలాగే మన శరీరంలో రక్త లోపాన్ని భర్తీ చేస్తుంది. మీరు చాలా సన్నగా ఉంటే, నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి సహాయపడుతుంది.
అత్తి పండ్లు: అంజీర పండ్లను నానబెట్టి రోజూ తింటే మలబద్ధకం, అసిడిటీ వంటి అనేక పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి పచ్చిగా తినకండి, నానబెట్టి తినండి.
వాల్‌నట్స్: ప్రతిరోజూ నానబెట్టిన వాల్‌నట్‌లను తీసుకుంటే, అది మెదడు, జ్ఞాపకశక్తి రెండింటినీ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా నానబెట్టిన వాల్‌నట్‌లను తినడం వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం