Black Pepper: బరువు తగ్గాలనుకునేవారికి నల్ల మిరియాలు ఒక వరమే.. ఇంకా వీటితో బోలేడు ప్రయోజనాలు కూడా.. అవేమిటంటే..?

క్రమం తప్పకుండా నల్ల మిరియాలను ఆహారాల్లో తీసుకుంటే శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే బరువు తగ్గాలనుకునేవారు కూడా తమ డైట్‌లో..

Black Pepper: బరువు తగ్గాలనుకునేవారికి నల్ల మిరియాలు ఒక వరమే.. ఇంకా వీటితో బోలేడు ప్రయోజనాలు కూడా.. అవేమిటంటే..?
Black Pepper For Weight Lose
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 06, 2023 | 8:55 AM

మన దేశంలో ముఖ్యంగా వంట గదిలో చాలా విరివిగా కనిపించే నల్ల మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలైనవి. సాధారణంగా ఆహారంలో మంచి రుచి కోసం ఉపయోగించే ఈ నల్ల మిరియాలతో మనకు తెలయని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మన పూర్వీకులు, ఆయర్వేద నిపుణులు దీనిని విరివిరిగా వాడుతుండేవారు. ఇంకా వాడుతున్నారు కూడా. వీటిని వాడుతారు. ఎందుకంటే నల్ల మిరియాల వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ బి6, థయామిన్, నియాసిన్, సోడియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా నల్ల మిరియాలను ఆహారాల్లో తీసుకుంటే శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే బరువు తగ్గాలనుకునేవారు కూడా తమ డైట్‌లో నల్ల మిరియాలను చేర్చుకుని వినియోగిస్తే.. సులభంగా బరువు తగ్గుతారు.

అంతేకాకుండా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకువారు తప్పకుండా నల్ల మిరియాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే నల్ల మిరియాలకు మరో విశిష్టత కూడా ఉంది. అదేమిటంటే.. మన దేశానికి మిరపకాయలు అనేవి పరిచయం కాకముందు మన పూర్వీకులు మిరియాల పొడినే కారంగా వాడేవారు. అంటే మిరియాలతో మన బంధం ఈ నాటిది కానే కాదు. కానీ మిరియాలను ఎక్కువగా వాడుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇంకా  మిరియాల్లో నల్లవే కాకుండా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లో కూడా ఉంటాయి. మరి అటువంటి మిరియాలతో బరువు ఎలా తగ్గుతారో.. ఇంకా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నల్ల మిరియాలతో బరువు ఎలా తగ్గుతారు..? 

నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పైపెరిన్.. మన శరీరంలోని కొవ్వును పెంచే కణాల తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో కేలరీలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది.

ఇవి కూడా చదవండి

నల్ల మిరియాలతో ఇతర ప్రయోజనాలు:

  1. నల్ల మిరియాల టీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, బరువు తగ్గించడానికి మీరు ప్రతి ఉదయం నల్ల మిరియాల టీ తాగవచ్చు. ఈ టీ చేయడానికి మీకు గ్రౌండ్ నల్ల మిరియాలు, నిమ్మరసం, తరిగిన అల్లం అవసరం. తరువాత రెండు కప్పుల నీరు ఉడకబెట్టి 4-5 నల్ల మిరియాలు, 1 నిమ్మరసం, తాజాగా తరిగిన అల్లం జోడించండి. ఐదు నిమిషాలు ఉడకనివ్వండి. టీ వడకట్టి తాగండి.
  2. మిరియాలను పొట్టును ఒక సంచిలో వేసి దాన్ని ఒక దిండుగా కూడా ఉపయోగిస్తారు. దీంతో తలనొప్పి వంటి దీర్ఘవ్యాధులు నయమవుతాయి.
  3. ఘాటైన వాసనను కలిగి ఉండడం వల్ల ఈ నల్ల మిరియాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగిస్తాయి. గ్రాము మిరియాలు తీసుకుని వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావు చెంచా వెల్లుల్లి మిశ్రమాన్ని, గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజూ రెండు, మూడు సార్లు చొప్పున తీసుకోవాలి. ఇది జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దూరం చేస్తుంది.
  4. నల్ల మిరియాలు లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తాయి. పొట్టలోని వాయువులను బయటికి పంపి రక్తప్రసరణ వేగవంతమయేలా చేస్తుంది.
  5. కొవ్వు ఎక్కువుగా పేరుకోకుండా చేసి. స్వేద ప్రక్రియ వేగవంతం చేస్తుంది . మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కండరాల నొప్పులు దూరమవుతాయి.
  6. చిటికెడు రాతి ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసుకుని, గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్లవాపు తగ్గి రక్తం రావడం వంటివి తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి