Viral: ఇలాంటి పెళ్లి నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వెడ్డింగ్ కార్డ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే మధురానుభూతి. అందుకే ప్రతి జంట తమ వివాహాన్ని ఎంతో ప్రత్యేకంగా, కలకాలం గుర్తుండిపోయేలా చేసుకుంటారు.
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే మధురానుభూతి. అందుకే ప్రతి జంట తమ వివాహాన్ని ఎంతో ప్రత్యేకంగా, కలకాలం గుర్తుండిపోయేలా చేసుకుంటారు. అయితే, పెళ్లి ద్వారా స్త్రీ, పురుషుడు ఒక్కటవ్వడం ఇప్పటి వరకు చూశాం. మరి ఒక్క పెళ్లితో ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడు ఒక్కటవ్వడం ఎప్పుడైనా చూశారా? అవును, ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇవాళే ఆ పెళ్లి జరుగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కుర్నపల్లి గ్రామానికి చెందిన సత్తిబాబు.. ఒకే ముహూర్తానికి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నాడు. వ్యవసాయ కూలీ అయిన సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పాటు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు. స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలుపగా.. విషయం తెలుసుకున్న సునీత సత్తిబాబును నిలదీసింది. విషయాన్ని తేల్చేందుకు పెద్దలు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.
దాంతో.. సత్తిబాబు ఇద్దరితోనూ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. పెళ్లి చేసుకోకుండా ఏడాది క్రితమే ఈ ఇద్దరితోనూ కాపురాన్ని ప్రారంభించాడు సత్తిబాబు. పైగా వీరిద్దరికీ ఒక్కో సంతానం ఉన్నారు. ఇక ఇప్పుడు వీరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వాస్తవానికి కోయ గిరిజనుల్లో కొన్ని తెగల వారు కొంత కాలం కలిసి కాపురం చేశాక వివాహం చేసుకోవడం ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. వీరు కూడా అదే సంప్రదాయాన్ని పాటించి, ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే, తమ పెళ్లి అందరి పెళ్లి మాదిరిగానే చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. బంధుమిత్రులకు శుభలేఖలు పంపారు. ఆ శుభలేఖలో వరుడి పేరు, ఇద్దరు వధువుల పేర్ల ఉండటంతో అంతా షాక్ అయ్యారు.
ఇక సత్తిబాబు తన వివాహాన్ని ఘనంగా చేసుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. తల్లిదండ్రులు, పెద్దల సూచన మేరకు సత్తిబాబు ఈనెల 9వ తేదీన అంటే గురువారం ఉదయం 7.04 గంటలకు స్వప్న, సునిత ల మెడలో తాళిబొట్టు కట్టనున్నాడు. అయితే, సత్తిబాబు పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో తెగ అవైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఒకే ముహూర్తానికి ఇద్దరిని చేసుకుంటున్న ఒక్క మగాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..