Telangana: తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర జీరో.. మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు..

తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్రపై మరోసారి అగ్గిరాజుకుంది. చట్టసభల సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా కేంద్రం నేరవేర్చనప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి విలువెక్కడిదని ప్రశ్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

Telangana: తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర జీరో.. మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు..
Minister Ktr
Follow us

|

Updated on: Mar 08, 2023 | 9:49 AM

తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్రపై మరోసారి అగ్గిరాజుకుంది. చట్టసభల సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా కేంద్రం నేరవేర్చనప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి విలువెక్కడిదని ప్రశ్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నిసార్లు లేఖలు రాసిన స్పందించని ప్రభుత్వానికి విమర్శించే హక్కులేదని కౌంటరిస్తోంది కేంద్రం.

బేగంపేటలో జరగిన CII తెలంగాణ వార్షికోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు.. వ్యాపారాలు, పెట్టుబడులకు రాష్ట్రం అత్యంత అనుకూలం అని చెబుతూనే.. ఇప్పటి వరకు కల్పించిన సౌకర్యాలను.. జరిగిన అభివృద్ధిని సమగ్రంగా వివరించారు. జనరల్ ఎలక్షన్స్‌కు ముందు జరిగే చివరి CII వార్షిక సదస్సు ఇదేనన్న కేటీఆర్.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకే ఓటేయాలని కోరారు.

ఈ 9 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకువెళ్లిందని చెప్పారు మంత్రి కేటీఆర్. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో ఇంతలా దూసుకెళ్తుంటే కేంద్రం మాత్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదని ఆరోపించారు కేటీఆర్.

ఇవి కూడా చదవండి

కేటీఆర్‌ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఆయన అబద్దాలకు మారుపేరని విమర్శించారు. మొత్తానికి తెలంగాణ అభివృద్ధిపై మరోసారి కేంద్రం వర్సెస్ స్టేట్‌ అన్నట్లుగా మారిపోయింది సీన్! CII వేదిక సాక్షిగా కేటీఆర్ కేంద్రాన్ని విమర్శించడం.. దానికి అదే రేంజ్‌లో కౌంటర్లు రావడంతో మ్యాటర్ హీటెక్కింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..