Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాన్ ముప్పు.! రాగల 24 గంటల్లో భారీ వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
బంగాళాఖాతంలో నెమ్మదిగా దిత్వా తుఫాన్ కదులుతోంది. గడచిన 6 గంటల్లో 7 కి.మీ. వేగంతో తుఫాన్ పయణిస్తోంది. చెన్నైకు 430, పుదుచ్చేరికి 330 కి.మీ. దూరంలో దిత్వా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

రాగల 24 గంటలలో తుఫాను ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ ఆదివారం ఉదయం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, సమీపంలోని దక్షిణ ఆంధ్రా కోస్తా తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయంది. ఆదివారం రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. అత్యధికంగా భద్రాచలంలో 16 డిగ్రీలు, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు ఏపీ విషయానికొస్తే.. నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాను ప్రస్తుతానికి ఇది కారైకాల్‌కి 220 కిమీ., పుదుచ్చేరికి 330 కిమీ., చెన్నైకి 430 కిమీ., దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. గడిచిన 6 గంటల్లో 7కి.మీ వేగంతో కదిలిన తుఫాన్.. ఆదివారం తెల్లవారుజామునకు తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకుంటుంది. దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు.. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




