Viral: అంత్యక్రియలు చేయాలని కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. కాటికాపరికి అనుమానమొచ్చి చూడగా
ఓ ఇద్దరు వ్యక్తులు.. చేతిలో ఒక మృతదేహం.. అది కూడా దాని చుట్టూ గుడ్డలు కప్పి తీసుకొచ్చారు. అక్కడే ఉన్న కాటికాపరికి దహన సంస్కారాల కోసం సిద్దం చేయమని చెప్పారు. అయితే ఈ ఇద్దరు కదలికలపై అనుమానమొచ్చిన అతడికి.. ఓ సారి చెక్ చేయగా..

ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం గర్హ్ముక్తేశ్వర్‌లోని బ్రిజ్‌ఘాట్‌లో ఇద్దరు యువకులు దహన సంస్కారాల కోసం ఓ కారులో స్మశానవాటికకు వచ్చారు. వారి భుజాలపై ఓ మృతదేహం.. అది కూడా దాన్ని గుడ్డలు చుట్టి తీసుకొచ్చారు. ఇక అక్కడున్నవారు చితిని పేర్చి.. అంత్యక్రియలు చేసేందుకు సిద్దమయ్యారు. కానీ కాటికాపరికి అనుమానమొచ్చింది. ఎక్కడో ఏదో తేడాగా ఉందని గమనించాడు. పక్కనే ఉన్న వ్యక్తుల సాయంతో ఆ మృతదేహం చుట్టూ కప్పి ఉన్న దుప్పటిని తీసివేశాడు. కట్ చేస్తే.! వారికి షాక్ తగిలేలా అదొక ప్లాస్టిక్ డమ్మీ అని తేలింది. అక్కడ గుమిగూడిన ప్రజలు దెబ్బకు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ ఇద్దరు యువకులను పట్టుకున్నారు.
‘శరీరం తేలికగా అనిపించింది. ఆకారం వింతగా కనిపించింది. వెంటనే వాళ్లు తీసుకొచ్చిన మృతదేహాన్ని చెక్ చేశాం. అది డమ్మీ అని చూసి అందరం షాక్ అయ్యం’ అని గ్రామస్తుల్లో ఒకరు చెప్పారు. కొద్దిసేపటికే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ చర్య వెనుక కుట్ర భాగం ఏదైనా ఉండొచ్చునని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. బీమా డబ్బును క్లెయిమ్ చేయడానికి, నేరస్థుడు మరణాన్ని ఫేక్‌గా చూపించి చట్టం నుంచి తప్పించుకోవడానికి లేదా ఏదైనా నేరానికి సంబంధించిన ఆధారాలను నాశనం చేసేందుకు జీవించి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లు తప్పుగా చూపించడానికి ఈ చర్య కుట్రలో భాగమై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
हापुड़ : हापुड़ से चौंकाने वाली खबर आई सामने शव की जगह पुतला लेकर पहुंचा परिवार ब्रजघाट में अंतिम संस्कार करने पहुँचा परिवार दिल्ली से अंतिम संस्कार करने आया था परिवार पुलिस ने दो लोगों को हिरासत में लिया, जांच जारी — गढ़ कोतवाली ब्रजघाट मामला #DummyCorpseScam… pic.twitter.com/T1pgholdYE
— India News UP/UK (@IndiaNewsUP_UK) November 27, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




