AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రోడ్డు ఊడుస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. ఓపెన్ చేయగా కళ్లు తేలేసిన మహిళ

సాధారణంగా నీతి, నిజాయితీ ఈ కాలంలో చూడాలంటే.. కష్టమే.! కానీ ఇక్కడ ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ఇంకా నిజాయితీ బ్రతికే ఉందని నిరూపించింది. అందుకు ఉదాహరణగా జరిగిన సంఘటన గురించి ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

Viral: రోడ్డు ఊడుస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. ఓపెన్ చేయగా కళ్లు తేలేసిన మహిళ
Representative Image
Ravi Kiran
|

Updated on: Nov 27, 2025 | 1:41 PM

Share

మనలో ఎవరికైనా రోడ్డు మీద పదో.. వందో.. దొరికితే కచ్చితంగా దాన్ని జేబులో పెట్టుకునే ఇంటికి పోతాం. మనలోని స్వార్ధం ఆ పని చేసేలా చేస్తుంది. మచ్చుకైనా ఈ కాలంలో నీతి, నిజాయితీని మనం చూడటం తక్కువ. అయితే అలా కాదు.. ఇంకా నిజాయితీ బతికే ఉందని చెబుతూ ఓ మహిళ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ తనకు దొరికిన రూ. 10 లక్షలను నిజాయితీగా వెనక్కి ఇచ్చింది. ఈ పని చేసింది ఓ పారిశుద్ద్య కార్మికురాలు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళ్తే.. పూణేలోని సదాశివ్ పేఠ్​లో అంజు మానే అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఆమె ఎప్పటిలానే నవంబర్​ 20న ఉదయం 7గంటలకు సదాశివ్​ పేఠ్​లోని ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరించడం, రోడ్డు ఊడుస్తుండగా.. ఆమెకు ఓ బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్ ఏంటా అని చూడగా.. దెబ్బకు షాక్ అయింది. అందులో మందులతోపాటు రూ. 10 లక్షల నగదు ఉండటాన్ని గమనించింది. ఆ డబ్బుకు ఏమాత్రం ఆశపడకుండా తిరిగి ఇవ్వాలనుకుంది.

మొదటిగా ఆ ప్రాంతంలో తనకు తెలిసిన ప్రతీ ఒక్కరిని ఈ బ్యాగ్ మీదేనా.. మీదేనా.. అంటూ అడిగింది. ఈలోపు ఓ వ్యక్తి ఏదో పోగొట్టుకున్నట్టు వీధిలో వెతుకుతూ కనిపిస్తాడు. అతడి దగ్గరకు వెళ్లి అడగగా.. ఆమెకు దొరికిన బ్యాగ్.. అతడిదే అని నిర్ధారించుకుని ఆ రూ. 10 లక్షల బ్యాగ్ తిరిగి ఇచ్చింది. తన నిజాయితీని నిరూపించుకుంది. ఈ క్రమంలోనే ఆమె చేసిన పనితో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

Telugu News 1

ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
సంతోషాన్ని లాగేసుకున్నా నేను 'రిచ్​'నే.. నటి ఎమోషనల్ పోస్ట్!
సంతోషాన్ని లాగేసుకున్నా నేను 'రిచ్​'నే.. నటి ఎమోషనల్ పోస్ట్!
YouTubeలో 1,000 వ్యూస్‌కు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎక్కువ రావాలంటే
YouTubeలో 1,000 వ్యూస్‌కు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎక్కువ రావాలంటే