Viral Video: బాత్రూం పైకప్పు మీద పెద్ద రంధ్రం.. కెమెరాను జూమ్ చేసి దెబ్బకు కంగుతిన్నారు
సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు చాలానే హల్చల్ చేస్తుంటాయి. అందులో ముఖ్యంగా సరీసృపాలకు సంబంధించిన వీడియోలు అయితే కోకొల్లలు. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి తెలుసుకుందామా..

మీ ఇంటి హాలులో హాయిగా కూర్చున్నప్పుడు, అకస్మాత్తుగా బాత్రూమ్ పైకప్పు కూలిపోయి ఒక పెద్ద కొండచిలువ బయటకు కనిపించిందని ఊహించుకోండి. సహజంగానే అలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే కచ్చితంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇటీవల, మలేషియాలోని కెడాలో ఒక కుటుంబానికి ఇలాంటి సంఘటన ఎదురైంది. అది చూసి వారంతా దెబ్బకు షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కుటుంబం బాత్రూమ్ పైకప్పు చూసినప్పుడు వింతగా ఏదో గమనించింది. వారికి ఒక పెద్ద రంధ్రం కనిపించింది. కెమెరాను ఆ రంధ్రంలోకి జూమ్ చేయగా.. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయారు.
ఆ రంధ్రం లోపల సుమారు 16 అడుగులు పొడవు, 60 కిలోగ్రాముల బరువున్న ఒక పెద్ద కొండచిలువ కనిపించింది. అది చూడగానే కుటుంబం భయభ్రాంతులకు గురైంది. వెంటనే జంతు సంరక్షణ బృందానికి ఫోన్ చేశారు. ఆ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ టీం సభ్యులను కూడా మొదటిగా కొండచిలువ భయపెట్టింది. కానీ ఎలాగోలా చివరికి లొంగదీసుకున్నారు. దానిని నివాస ప్రాంతాలకు దూరంగా అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




