AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వ్యక్తి కడుపులో కండోమ్.. కట్ చేస్తే.. డాక్టర్ చేసిన పనికి బిత్తరపోతారు

టైటిల్ కొంచెం విచిత్రంగా అనిపించినా.. లోపల కంటెంట్ చూస్తే మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది. కొందరు డాక్టర్లు చేసిన పనికి మొత్తం అందరూ బిత్తరపోయారు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Viral: వ్యక్తి కడుపులో కండోమ్.. కట్ చేస్తే.. డాక్టర్ చేసిన పనికి బిత్తరపోతారు
Doctors
Ravi Kiran
|

Updated on: Nov 28, 2025 | 1:36 PM

Share

టైటిల్ చూసి మోసపోవద్దు. కంటెంట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. డాక్టర్లు చేసిన ఈ పని వైద్యచరిత్రలోనే మొదటిది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకోగా.. ఆ వ్యక్తి(డెంగ్) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. 30 సంవత్సరాల క్రితం తాగిన మత్తులో ఒక వ్యక్తి సిగరెట్ లైటర్‌ను మింగడంతో.. వైద్యులు కండోమ్‌ను ఉపయోగించి అతని కడుపులోంచి సిగరెట్ లైటర్‌ను బయటకు తీశారు.

ఈ లైటర్ మూడు దశాబ్దాల క్రితం సదరు రోగి మింగేయగా.. అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అప్పుడప్పుడు వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందుతున్నాడు ఆ వ్యక్తి. నెల రోజుల క్రితం వరకు అతనికి నిరంతర కడుపు ఉబ్బరం, నొప్పి వస్తుండటంతో.. టెస్టుల కోసం ఆస్పత్రికి వచ్చాడు. గ్యాస్ట్రోస్కోపీ సమయంలో వైద్యులు అతని కడుపులో లోతుగా నల్లటి వస్తువు ఉన్నట్టు గమనించారు. చైనాలోని చెంగ్డు అనే ప్రాంతం నుంచి వచ్చిన ఆ రోగి ‘1991 లేదా 92 సంవత్సరంలో, స్నేహితుడితో కలిసి మద్యం సేవిస్తూ.. ఓ పందెం కాశానని.. ఆ సమయంలో తాను ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. ఇక డెంగ్ భార్య, కుమారుడికి ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు.

వైద్యులు మొదట ఫోర్సెప్స్‌తో లైటర్‌ను తొలగించడానికి ప్రయత్నించారు. కానీ ఆ వస్తువు బయట ఉపరితలం చాలా సెన్సిటివ్‌గా ఉండటంతో.. కండోమ్‌ను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫోర్సెప్స్ ద్వారా కండోమ్‌ను రోగి కడుపులోకి నెమ్మదిగా చొప్పించి.. నోటి ద్వారా ఆ లైటర్‌ను జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ప్రక్రియ పూర్తీ కావడానికి 20 నిమిషాలు పట్టింది. ఇక తొలగించిన లైటర్ పొడవు దాదాపుగా 7 సెంటీమీటర్లు ఉందని.. ఆ వస్తువు తుప్పు పట్టినట్టు అవుతోందని డాక్టర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇదే!
అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇదే!
మనుషుల పై ఏఐ తిరగబడనుందా?
మనుషుల పై ఏఐ తిరగబడనుందా?
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
తొలకరి పలకరింపుతో తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
తొలకరి పలకరింపుతో తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో