AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రోడ్డుపై వెళ్తుండగా దూరాన కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటా అని టార్చ్ వేయగా..

నడిరోడ్డుపై మొసలి ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో తెలుసా.? ఆ మొసలిని సాహసోపేతంగా వలలో బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు యువకులు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసా.? ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.

Telangana: రోడ్డుపై వెళ్తుండగా దూరాన కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటా అని టార్చ్ వేయగా..
Crocodile Video
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jan 08, 2026 | 8:41 AM

Share

ప్రశాంతంగా వెళ్తున్న రోడ్డుపై అకస్మాత్తుగా మొసలి కనిపిస్తే ఎలా ఉంటుంది.? ఆ గ్రామ శివారులో భారీ మొసలిని చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆపై సాహసం చేసి ఆ మొసలిని వలలతో బంధించారు. దాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగించి ఊరంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మహబూబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ పరిధిలోని భూక్య దసురుతండాలో జరిగింది. ఈ మార్గంలో తండావాసులు నిత్యం కాలి నడకన వెళుతుంటారు. సమీపంలో ఎక్కడా చెరువులు కూడా లేవు కానీ హఠాత్తుగా నడి రోడ్డుపై మొసలి ప్రత్యక్షమయింది.

ఇది చదవండి: చక్రం డిజాస్టర్ తర్వాత ప్రభాస్ తనతో ఎలా ఉన్నాడంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్..

తండాకు వెళ్లే రాళ్ల వాగు బ్రిడ్జిపై మొసలి సంచారాన్ని అటుగా వెళుతున్న తండా యువకులు గమనించారు. భారీ మొసలిని చూసి పరుగులు పెట్టారు. కొంతమంది యువకులు ఆ మొసలిని పట్టడానికి సాహసమే చేశారు. ఆ మొసలిని సాహసోపేతంగా చేపల వలతో బంధించి గూడూరు ఫారెస్ట్ శాఖ అధికారులకు అప్పగించారు. అయితే ఈ ప్రాంతంలో మొసలి కనిపించడం ఇదే మొదటిసారి. తండా పరిసర ప్రాంతాల్లో ఇంకా మొసళ్ళు ఉన్నాయి కావచ్చని స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ‘నా వల్లే ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్ అయిందన్నారు..’ మా మధ్య దూరం అందుకే.!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !