AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: ఉర్దూ యూనివర్సిటీ భూములను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చూస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ భూముల అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ భూములను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందంటూ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించడంతోపాటు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy: ఉర్దూ యూనివర్సిటీ భూములను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చూస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jan 08, 2026 | 9:11 AM

Share

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) భూముల అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. వర్సిటీలోని 200 ఎకరాల్లో ఖాళీగా ఉన్న 50 ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నోటీసులు పంపగా.. ఆ భూముల్లో నిర్మాణ ప్రతిపాదనలున్నాయని, దీనిపై 2 నెలల్లో వివరాలు అందిస్తామని వర్సిటీ ప్రభుత్వానికి చెప్పింది. అయితే.. ఈ భూములను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందంటూ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బడ్జెట్ కేటాయింపుల్లేకుండా రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తున్న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు యూనివర్సిటీల భూములను కాజేయడంపై ‘మిషన్ మోడ్’లో పనిచేస్తోందంటూ విమర్శించారు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు పరం చేసేందుకు.. అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని లెక్కచేయకుండా ఆ భూమిని చదును చేసేందుకు ప్రయత్నించిందని.. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేస్తే వెనక్కు తగ్గిందంటూ పేర్కొన్నారు.

ఇప్పుడు హైదరాబాద్, గచ్చిబౌలిలోని ప్రఖ్యాత మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు… యూనివర్సిటీలోని 50 ఎకరాలను వెనక్కు తీసుకుని మళ్లీ ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసిందంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు.

యూనివర్సిటీల వద్ద భూమి ఉంటే.. అది వర్సిటీల భవిష్యత్ అవసరాలకోసం, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.. అంతే తప్ప.. ప్రభుత్వ ఖజానాను నింపేందుకు వీటిని వాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవడం.. యూనివర్సిటీ భూములను ఆర్థిక దోపిడీకి వాడుకోవడంపైనే రేవంత్ రెడ్డి సర్కారు ఆసక్తి చూపిస్తోంది.. తప్ప రాష్ట్రంలో విద్యావ్యవస్థ, వర్సిటీల పురోగతిని మాత్రం అంధకారంలోకి నెట్టేస్తోందంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అరుదైన అనంత పద్మనాభస్వామి ఆలయం.. తెలుగు రాష్ట్రంలోనే ఎక్కడుందంటే?
అరుదైన అనంత పద్మనాభస్వామి ఆలయం.. తెలుగు రాష్ట్రంలోనే ఎక్కడుందంటే?
బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్..రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా
బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్..రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా
ప్రతి ఆదివారం చేపలు కూర లాగించేస్తున్నారా?
ప్రతి ఆదివారం చేపలు కూర లాగించేస్తున్నారా?
సెట్‌లో పాము కాటేసింది.. శరీరం నీలం రంగులోకి మారిపోయింది..
సెట్‌లో పాము కాటేసింది.. శరీరం నీలం రంగులోకి మారిపోయింది..
చిరంజీవి నటించిన ఏకైక హాలీవుడ్ మూవీ..
చిరంజీవి నటించిన ఏకైక హాలీవుడ్ మూవీ..
గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరిలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరిలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
జైలుకెళ్లి వచ్చి కెరీర్ నాశనం చేసుకున్న టీమిండియా క్రికెటర్లు
జైలుకెళ్లి వచ్చి కెరీర్ నాశనం చేసుకున్న టీమిండియా క్రికెటర్లు
హోటళ్లలో తిన్న తర్వాత సోంపు ఎందుకు ఇస్తారో తెలుసా..? అసలు కారణం..
హోటళ్లలో తిన్న తర్వాత సోంపు ఎందుకు ఇస్తారో తెలుసా..? అసలు కారణం..
బంగారం, వెండి కొనేటప్పుడు గులాబీ రంగు కాగితం ఎందుకు ఉపయోగిస్తారు?
బంగారం, వెండి కొనేటప్పుడు గులాబీ రంగు కాగితం ఎందుకు ఉపయోగిస్తారు?
తల్లిదండ్రులకు బిగ్ రిలీఫ్‌.. ఇకపై స్కూల్‌లోనే ఆధార్ అప్డేట్స్‌..
తల్లిదండ్రులకు బిగ్ రిలీఫ్‌.. ఇకపై స్కూల్‌లోనే ఆధార్ అప్డేట్స్‌..