Hyderabad: తిక్క కుదిరింది.! మైనర్లతో బూతు ఇంటర్వ్యూలు.. హైదరాబాద్ యూట్యూబర్ అరెస్ట్..
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ ఎక్కువైపోయింది. అలాగే మైనర్లతో ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. తాజాగా ఓ యూట్యూబర్ ను అరెస్ట్ చేసారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

యూట్యూబ్‌లో వ్యూస్ కోసం హద్దులు దాటుతున్న కంటెంట్ క్రియేటర్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. మైనర్లను లక్ష్యంగా చేసుకుని అశ్లీల ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ వాటిని వైరల్ వీడియోలుగా ప్రచారం చేసిన మరో యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘వైరల్ హబ్’ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న కంబేటి సత్యమూర్తిని బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 నుంచి 17 ఏళ్ల వయసున్న బాలబాలికలతో ఇంటర్వ్యూలు చేస్తూ అసభ్య ప్రశ్నలు అడగడం, అనుచితంగా ప్రవర్తించడం ద్వారా లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు విచారణలో తేలింది.
ఇది చదవండి: చక్రం డిజాస్టర్ తర్వాత ప్రభాస్ తనతో ఎలా ఉన్నాడంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్..
మైనర్లతో చేసిన ఈ అశ్లీల ఇంటర్వ్యూల వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి వ్యూస్ పెంచుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోక్సో చట్టం, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్లను ఉపయోగించి చట్టవిరుద్ధమైన కంటెంట్ సృష్టించినా, అలాంటి వీడియోలను ప్రచారం చేసినా కఠిన చర్యలు తప్పవని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలపై నైతిక విలువలు మరిచి చేసే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
ఇది చదవండి: ‘నా వల్లే ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్ అయిందన్నారు..’ మా మధ్య దూరం అందుకే.!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




