AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్‌పై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పీజేఆర్ కూతురు..?

త్వరలో ప్రకటించే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో తమకు అవకాశం కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి తర్వాత కాంగ్రెస్‌లో ప్రాధాన్యత గల వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం నేత లు తీవ్రంగా పోటీ పడుతున్నారు.

Telangana: హైదరాబాద్‌పై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పీజేఆర్ కూతురు..?
Mahesh Goud Vijaya Reddy
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Sep 20, 2024 | 5:06 PM

Share

త్వరలో ప్రకటించే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో తమకు అవకాశం కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి తర్వాత కాంగ్రెస్‌లో ప్రాధాన్యత గల వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం నేత లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ అదేవిధంగా పీసీసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో నేతలు లాబీయింగ్ చేస్తున్నారట. తాజగా మహిళ కోటాలో తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం దివంగత నేత పీజేఆర్ కూతురు విజయా రెడ్డి పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరొక వైపు త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ పీఠంపై ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గ్రేటర్‌లో బలోపేతం చేయాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపధ్యంలోనే చేరికలపై దృష్టి సారించింది కాంగ్రెస్. ఆ కోణంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చారు. మరి కొందరిని కూడా రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి,

పార్టీ పదవుల విషయంలో ఈసారి గ్రేటర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే పీసీసీ కమిటీలో గ్రేటర్ లోని నేతలకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో పీజేఆర్ కూతురు విజయా రెడ్డికి మహిళా కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే, కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ విజయారెడ్డి కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే, పీజేఆర్‌కు ఉన్న ఇమేజ్ కూడా కలిసి వస్తుందని హై కమాండ్ భావిస్తోందట.

మరి హై కమాండ్ అనుకున్నట్లు గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇస్తే కాంగ్రెస్ బలం పుంజుకుంటుందా, పీజేఆర్ కూతురు విజయా రెడ్డి కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బీజేఆర్‌కు ఉన్న ఇమేజ్ తో గ్రేటర్ లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది, మరి కాంగ్రెస్ మంత్రం వర్కౌట్ అవుతుందా మరి మహిళ కోటాలో విజయా రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ దక్కుతుందా అనేది ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్