Telangana: వామ్మో వీళ్లు మామూలోళ్లు కాదు.. సీసీ కెమెరాలకు అడ్డంగా బుక్కైన కిలాడీ లేడీలు..!

చీకటి పడ్డాక తాళాలు పగలగొట్టి దోచుకునే దొంగలు కాదు వాళ్లు. మూడో కంటికి కన్పించకుండా కన్నం వేసే టైపు కానే కాదు. కత్తులతో బెదిరించి సొమ్ము కాజేసే రకం అస్సలు కాదు. దర్జాగా లోపలికి వస్తారు. మొదట షాపు ఓనర్‌ను కన్ఫ్యూజ్‌ చేస్తారు. ఆ సమయంలోనే తమ పని పూర్తి చేస్తారు.

Telangana: వామ్మో వీళ్లు మామూలోళ్లు కాదు.. సీసీ కెమెరాలకు అడ్డంగా బుక్కైన కిలాడీ లేడీలు..!
Saree Thives
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Sep 20, 2024 | 5:54 PM

చీకటి పడ్డాక తాళాలు పగలగొట్టి దోచుకునే దొంగలు కాదు వాళ్లు. మూడో కంటికి కన్పించకుండా కన్నం వేసే టైపు కానే కాదు. కత్తులతో బెదిరించి సొమ్ము కాజేసే రకం అస్సలు కాదు. దర్జాగా లోపలికి వస్తారు. మొదట షాపు ఓనర్‌ను కన్ఫ్యూజ్‌ చేస్తారు. ఆ సమయంలోనే తమ పని పూర్తి చేస్తారు. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోతుంది. ఓనర్‌ తేరుకునేలోపు నిలువు దోపిడీ జరిగిపోతుంది. సీసీటీవీ ఫుటేజ్‌ చూస్తే కానీ అక్కడ దొంగతనం జరిగిందన్న విషయం తెలుసుకోలేరు. అంత చాకచక్యంగా దోచేస్తారు. అంతా ఓ ప్లాన్‌ ప్రకారం చోరీ చేస్తారు.

వాళ్లంతా లేడీ కేడీలు. కొనుగోలుదారుల ముసుగులోనే దొంగతనాలకు పాల్పడుతుంటారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇదే చోరీకి పాల్పడ్డారు కిలాడీ లేడీలు. కొత్త బస్టాండ్ వద్ద లిప్సిక సారీ సెంటర్‌ను నరేష్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. శుక్రవారం(సెప్టెంబర్ 20) పట్టపగలు ఐదుగురు మహిళలు షాపులోకి వచ్చినవాళ్ళు చీరెలు, వివిధ రకాల బట్టలు చూపెట్టమని కోరారు. అక్కడ చాలా వేరైటిస్ ఉన్నాయని తెలిపడంతో సారీస్ కొంటున్నట్లు నటించారు. ఐదుగురు మహిళలో నుండి ఒక మహిళ షాపు యజమాని భార్య దృష్టి మరల్చి కౌంటర్ వద్ద ఆమెతో ఏదో మాట్లాడుతూ మాటల్లో దింపింది. మిగితా మహిళలు చీరెలు చూస్తున్నట్లు అటు ఇటూ కదులుతూ పక్కన ఉన్న మహిళలకు కనబడకుండా చేసింది. చీరెలు అడ్డుపెడుతూ ఇంకొందరు మహిళలు అక్కడ ఉన్న  కొన్ని చీరలు వారి కాళ్ళ మధ్య భాగాన పెట్టుకుని ఏం తెలియదనట్లుగా అక్కడి నుండి జారుకున్నారు.

అర గంట తర్వాత షాపులోకి వచ్చిన యజమాని నరేష్ భార్యను అడిగాడు. కొందరు మహిళలు వచ్చి, ఏం కొనకుండా వెళ్ళారని, వాళ్ళు తెచ్చుకున్న  ఆటోలో ఆ ఐదుగురు మహిళలు వెళ్ళిపోయారు అని సమాధానం ఇచ్చింది. దీంతో షాప్ యజమానికి అనుమానం రావడంతో షాపులోని సీసీ కెమెరాలు ఫుటేజీ పరిశీలించగా సీసీ కెమెరాలలో వారి బాగోతం అంత బయటపటడింది. ఇద్దరు మహిళలు కౌంటర్ వద్ద బేరం చేస్తూ మరో ముగ్గురు మహిళలు డ్రెస్సులు అడ్డం పెట్టుకుంటూ దొంగతనానికి పాల్పడినట్లు సిసి కెమెరాలు రికార్డ్ కావడంతో యజమాని అవాక్కయ్యాడు. మహిళల గురించి చుట్టుపక్కల అడుగగా అప్పటికే వాళ్ళు గ్రామం విడిచి వెళ్లినట్లు తెలిపారు. సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించగా షాపులో పట్టు చీరలు దొంగతనం జరిగినట్లు షాపు యజమాని తెలిపారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..