ఐడియా అదుర్స్ కదూ.. పంల పొలాల రక్షణకు నిఘా నేత్రాలు పెట్టిన అన్నదాతలు..!
వ్యవసాయ బావులు, పొలాల వద్ద బోరు మోటార్లను, వైర్ల దొంగతనాలు పెరుగుతున్నాయి. ఇలా ఎత్తుకెళ్లి రైతులను ఇబ్బందులకు గురుచేస్తున్న దొంగల బెడద నుండి బయట పడేందుకు వినూత్న ఆలోచన చేశారు సిద్దిపేట జిల్లాకు చెందిన రైతులు.
వ్యవసాయ బావులు, పొలాల వద్ద బోరు మోటార్లను, వైర్ల దొంగతనాలు పెరుగుతున్నాయి. ఇలా ఎత్తుకెళ్లి రైతులను ఇబ్బందులకు గురుచేస్తున్న దొంగల బెడద నుండి బయట పడేందుకువినూత్న ఆలోచన చేశారు సిద్దిపేట జిల్లాకు చెందిన రైతులు. రైతులందరూ కలిసి డబ్బులు పోగుచేసి, దొంగలను పట్టుకునేందుకు సోలార్ సిస్టంతో మూడో కన్ను వ్యవసాయ పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్నరు. అవి నిరంతరం కాపలా కాసేలాగా ఏర్పాట్లు చేసుకున్న రు.
దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన రైతులు ఊరు ప్రక్కనే ఉండే కూడవెల్లి వాగుకు అనుకుని ఉన్న పరిసర ప్రాంతాల రైతులు వాగులో మోటర్ వేసుకుని పంట పొలాలను సాగుచేస్తారు. కాగా, ఈ మధ్య కాలంలో రాత్రిపూట దొంగలు మోటార్లను, కేబుల్‌లను దొంగతనంగా ఎత్తుకెళుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రైతన్నలు ఏకమై తలో పైసా వేసుకుని సోలార్ సిస్టంతో పొలాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు.
ఇది చూసిన సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం తుజాల్ పూర్ గ్రామ రైతులు సైతం దొంగల కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాల్లోనే మా వ్యవసాయ పొలాలు ఉంటాయని అన్నారు. రాత్రివేళల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పొలాల వద్దకు వచ్చి కేబుల్ వైర్లు, మోటార్లను ఎత్తుకెళ్లారని అన్నారు. దీంతో ఎలాగైనా దొంగలను పట్టుకోవాలనే సంకల్పంతో ఈ ప్రాంత రైతులు అందరు కలిసి సుమారు 45 వేల రూపాయలతో సోలార్ సిస్టంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని అన్నారు.
ఈ సీసీ కెమెరాల ప్రాంతంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే ఆ సీసీ కెమెరాలు సైరెన్ లాంటి శబ్దాలతో ఎవరో ఉన్నారని గుర్తుపట్టే విధంగా ప్లాన్ చేశామని రైతులు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నాటి నుండి మా ప్రాంతంలో ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. మూడో కన్ను ముచ్చటగా పనిచేస్తుందని అన్నారు. ఇలానే అందరూ రైతులు వారి వారి పొలాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రైతన్నలు.
వీడియో చూడండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..