Hyderabad: ఇరవై రూపాయల వాటర్ బాటిల్ కోసం వచ్చి.. ఎంత పని చేశాడు..!
దొంగలందు.. మహా దొంగలు వేరయా..! అన్నట్లు కొందరు ఎలాంటి జంకు బొంకు లేకుండా చోరీలకు పాల్పడి ఎంచక్కా తప్పించుకుంటారు. ఇంకొందరు ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల వెంటనే దొరికిపోతారు.
దొంగలందు.. మహా దొంగలు వేరయా..! అన్నట్లు కొందరు ఎలాంటి జంకు బొంకు లేకుండా చోరీలకు పాల్పడి ఎంచక్కా తప్పించుకుంటారు. ఇంకొందరు ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల వెంటనే దొరికిపోతారు. ఇక్కడ కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. చిన్న వాటర్ బాటిల్ కొనడానికి వచ్చి ఏకంగా మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో చాలా స్పష్టంగా రికార్డయ్యాయి. మరి ఆ దొంగ కథ ఏంటో.. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..!
హైదరాబాద్ మహానగరం పాతబస్తీలోని సంతోష్ నగర్ పరిధిలోని ఫిసల్‌బండ ప్రాంతంలో ఓ శవర్మా సెంటర్ ఉంది. ఆ షాపులోకి వచ్చిన ఓ వ్యక్తి ముందు వాటర్ బాటిల్ కావాలని అక్కడ అడిగాడు. షాపు ఓనర్ ఫ్రిజ్‌లో నుంచి బాటిల్ తీసి ఇచ్చే క్రమంలో ఎలాగైనా చోరీకి పాల్పడాలని అనుకున్నాడేమో ఆ దొంగ. ఓనర్ గమనించని సమయం చూసి, అక్కడే పక్కన టేబుల్‌పై ఉన్న మొబైల్ ఫోన్ తీసి అటూ ఇటూ చూస్తూ తన జేబులో పెట్టేసుకున్నాడు. అంతే కాకుండా దొంగ చూపులు చూస్తూ, చివరలో సీసీటీవీ కెమెరాని కూడా ఆ దొంగ చూడడం గమనార్హం. చేసేది తప్పు అని తెలిసినా ఎంతో దర్జాగా ఫోన్ దొంగతనం చేసి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ విషయం తెలియని షాపు ఓనర్ తన పనేదో తాను చేసుకుంటూ ఉండిపోయాడు.
కష్టపడి సంపాదించే దాంట్లో ఒక సంతృప్తి ఉంటుంది. అంతే కానీ ఇలా దొంగతనం చేసి తేరగా తిని కూర్చుంటే ఆ విలువ ఎప్పటికీ తెలియదు. పైగా ఇక్కడ ఈ దొంగ నడి వయసులో ఉన్న ఒక యువకుడే. సొంత కష్టాన్ని నమ్ముకుని సంపాదించాల్సిన వయసులో ఇలా దొంగతనానికి పాల్పడుతూ పబ్బం గడుపుకోవడం చాలా దారుణం. షాపు ఓనర్ కూడా తన జీవనోపాధి నిమిత్తం అలా షాపు పెట్టుకుని ఎంతో కొంత సంపాదించుకుంటాడు కదా..! మరి అలాంటివారికి అన్యాయం చేసి వారి పొట్ట కొట్టడం ఎంత తప్పో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇరవై రూపాయలు విలువ చేసే వాటర్ బాటిల్ కోసం వచ్చినట్లుగా నమ్మించి మొబైల్ ఫోన్ చోరీ చేశాడంటే ఖచ్చితంగా ఆ యువకుడికి తగిన రీతిలో శిక్ష పడాల్సిందే..!
వీడియో చూడండి…
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..