Jani Master: లైంగిక వేధింపుల కేసులో చంచల్‌గూడ జైలుకు జానీ మాస్టర్..

అటు జానీమాస్టర్ భార్య అయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీమాస్టర్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆ పై అతన్ని హైదరాబాద్ కు తరలించారు. కాగా తాజాగా కోర్టు జానీకి 14రోజులు రిమాండ్ విధించింది. ఈమేరకు ఆయనకు చంచల్ గూడా జైలుకు తరలించారు.

Jani Master: లైంగిక వేధింపుల కేసులో చంచల్‌గూడ జైలుకు జానీ మాస్టర్..
Jani Master
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 20, 2024 | 3:39 PM

జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. లైంగిక వేధింపుల కేసులో నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు జానీమాస్టర్ భార్య అయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీమాస్టర్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆ పై అతన్ని హైదరాబాద్‌కు తరలించారు. కాగా తాజాగా కోర్టు జానీకి 14రోజులు రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనకు చంచల్ గూడా జైలుకు తరలించారు. ఉప్పర్‌పల్లి కోర్టు జానీమాస్టర్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కాగా  బెయిల్‌ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆశ్రయించాడు జానీమాస్టర్‌. బాధితురాలిపై జానీ లైంగిక దాడి చేసిన సమయంలో ఆమె మైనర్ కావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోక్సో కావడంతో నాన్‌బెయిలబుల్‌ కేసులో ఉన్నాడు జానీ. ఇక అక్టోబర్‌ 3 వరకు రిమాండ్‌లోనే జానీమాస్టర్‌ ఉండాలని కోర్టు ఆదేశించింది. అలాగే  నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్‌ వేయనున్నారు.

ఇక పోలీసుల విచారణలో జానీమాస్టర్‌ సంచలన విషయాలు బయటపెట్టారు. తాను ఎలాంటి లైంగిక వేధింపులకూ పాల్పడలేదని, కావాలనే కొందరు తన పై ఫిర్యాదు చేయించారని అన్నాడు. అలాగే  లీగల్‌గా పోరాడి నిజాయితీగా బయటకు వస్తా.. నన్ను ఇరికించిన వాళ్లను వదలిపెట్టను అని జానీ అన్నాడు. ఈనెల 15న జానీమాస్టర్‌పై FIR నమోదు చేశారు పోలీసులు,  ఆరోజు నుంచి జానీమాస్టర్‌ అజ్ఙాతంలో ఉన్నాడు. కాగా విచారణ అనంతరం రాజేంద్రనగర్‌ లోని జాయ్‌ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. అనంతరం ఉప్పర్‌పల్లి కోర్టు జానీమాస్టర్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.