AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: ఉప్పర్‌పల్లి కోర్టుకు జానీమాస్టర్.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు..

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది. కేవలం ఇండస్ట్రీలోనే కాదు.. పొలిటికల్ సర్కిల్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారిందీ ఇష్యూ. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గురువారం గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కాసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టులో హజరుపరిచారు.

Jani Master: ఉప్పర్‌పల్లి కోర్టుకు జానీమాస్టర్.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు..
Jani Master
Rajitha Chanti
|

Updated on: Sep 20, 2024 | 1:48 PM

Share

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది. కేవలం ఇండస్ట్రీలోనే కాదు.. పొలిటికల్ సర్కిల్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారిందీ ఇష్యూ. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గురువారం గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కాసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టులో హజరుపరిచారు. ఇదిలా ఉంటే.. పోలీసుల విచారణలో జానీమాస్టర్‌ సంచలన విషయాలను బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ” నేను ఎలాంటి లైంగిక వేధింపులకూ పాల్పడలేదు. కావాలనే కొందరు తనపై ఫిర్యాదు చేయించారు. ఈ కేసుపై లీగల్‌గా పోరాడి నిజాయితీగా బయటకు వస్తాను. ఇందులో నన్ను ఇరికించిన వారిని వదిలిపెట్టను ” అని అన్నారు.

జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. కొన్నేళ్లుగా తనను బెదిరిస్తున్నాడని.. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది.  దీంతో ఈనెల 15న జానీమాస్టర్‌పై FIR నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. అనంతరం ఈ కేసును నార్సింగి పోలీసులకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. ఆరోజు నుంచి అజ్ఙాతంలోనే ఉన్న జానీమాస్టర్‌‏ను గురువారం గోవాలో అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం 4 గంటలకు హైదరాబాద్ తీసుకువచ్చిన పోలీసులు.. విచారణ అనంతరం రాజేంద్రనగర్‌ లోని జాయ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. ప్రస్తుతం కోర్టులో జడ్జి ముందు హాజరుపర్చారు.

జానీ మాస్టర్‌పై వస్తున్న ఆరోపణలు అన్ని ఫాల్స్ ఎలిగేషన్ అంటున్నారు ఆయన భార్య అయేషా. తన భర్తను ఇండస్ట్రీలో ఎదగనియకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మొన్న రేవు పార్టీ అన్నారు.. ఇప్పడు లైంగిక ఆరోపణలు చేస్తున్నారని అయేషా అన్నారు. జానీ మాస్టర్‌ కేసుపై ఇండస్ట్రీకి చెందిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ కెరీర్ పరంగా ఎంత శ్రమించారో పరిశ్రమలో అందరికీ తెలుసని.. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలు తన మనసును ముక్కలు చేసిందన్నారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని… ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని సూచించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.