AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: హరి హర వీరమల్లు నుంచి సాలిడ్ అప్డేట్.. షూటింగ్‏లో పవన్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే..

దీంతో ఈ మూవీకి సంబంధించిన మిగతా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయాలనుకున్నారు మేకర్స్.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. గతంలో తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాలనుంటున్నారు. అందుకే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఉన్నప్పటికీ సమయం చూసుకొని షూటింగ్ చేసేందుకు రెడీ అయ్యారు.

Pawan Kalyan: హరి హర వీరమల్లు నుంచి సాలిడ్ అప్డేట్.. షూటింగ్‏లో పవన్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే..
Hari Hara Veeramallu
Rajitha Chanti
|

Updated on: Sep 20, 2024 | 1:29 PM

Share

తెలుగు సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. ఇప్పుడు ప్రజా సేవ కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి గొప్ప నాయకుడిగా పేరు పొందారు. అటు ప్రజాసేవకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్.. మరోవైపు అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘హరి హర వీర మల్లు’ షూటింగ్ ను పూర్తి చేయడానికి తగిన సమయం కేటాయించలేకపోయారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన మిగతా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయాలనుకున్నారు మేకర్స్.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. గతంలో తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాలనుంటున్నారు. అందుకే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఉన్నప్పటికీ సమయం చూసుకొని షూటింగ్ చేసేందుకు రెడీ అయ్యారు.

త్వరలోనే పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మీవీ చిత్రీకరణలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి విజయవాడలో ‘హరి హర వీర మల్లు’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అలాగే హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం షూట్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. నిక్ పావెల్ ఇప్పటికే ‘బ్రేవ్‌హార్ట్’, ‘గ్లాడియేటర్’, ‘బోర్న్ ఐడెంటిటీ’, ‘ది లాస్ట్ సమురాయ్’, ‘రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్’ వంటి పలు క్లాసిక్ చిత్రాలకు వర్క్ చేశారు.. 1986లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నిక్, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా, ఫైట్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిష్టాత్మక టారస్ వరల్డ్ స్టంట్ అవార్డులకు ఏకంగా 12 సార్లు నామినేట్ అయిన నిక్ పావెల్, ఐదు అవార్డులను గెలుచుకున్నారు.

మొత్తం 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో ఈ భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందులో సీనియర్ నటులు నాజర్, రఘుబాబుతో పాటు సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప వంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.. మునుపెన్నడూ చూడని స్థాయిలో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు యువ దర్శకుడు జ్యోతికృష్ణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా, మరో కీలకమైన పాత్రలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ను రంగంలోకి దింపారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్న ఈ కీలకమైన విజయవాడ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది. ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ను త్వరలోనే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.