Congress: భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘనం.. మరీ లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితేంటి..?

భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘనంగానే ఉన్నా... భవిష్యత్‌లో మళ్లీ పుంజుకుంటారా ? లేదా ? అన్నదీ ఆసక్తి రేపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టుమని మూడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది.

Congress: భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘనం.. మరీ లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితేంటి..?
Congress
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 21, 2024 | 6:03 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు చక్రం తిప్పేశారు. భాగ్యనగరంలో పుట్టిన మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య లాంటి వారు రాష్ట్ర ముఖ్యమంత్రులయ్యారు. కొండా వెంకట రంగారెడ్డి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం ఎవరైనా హైదరాబాద్ నేతలకు ప్రయార్టీ ఉండాల్సిందే. శంకర్ రావు, వీ.హన్మంత్ రావు లాంటి వాళ్లు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ బ్రదర్స్‌గా పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి పేరు సాధించారు. ఆ తర్వాత దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్ లు… వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘనంగానే ఉన్నా… భవిష్యత్‌లో మళ్లీ పుంజుకుంటారా ? లేదా ? అన్నదీ ఆసక్తి రేపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టుమని మూడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది.

మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, సిట్టింగ్ పార్లమెంట్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇదిలావుంటే పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి రెడీగా ఉన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కండువా ఏ క్షణమైన కప్పుకునే అవకాశాలున్నాయి. ఈ పార్లమెంట్ స్థానం నుంచి ఇటీవలే హస్తం గూటికి చేరిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌ సునీతా మహేందర్ రెడ్డినిలోక్‌సభ ఎన్నికల బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్‌పై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సీటులో పోటీ చేసేందుకు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల బాధ్యతలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు అప్పగించారు. నియోజకవర్గ ఇంచార్జ్‌గా తుమ్మల ముఖ్యనేతలందరితో సమావేశమవుతూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇక రేవంత్ తన సిట్టింగ్ స్థానంలో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? పార్టీలో ఉన్న పాత లీడర్లకు అవకాశం కల్పిస్తారా ? కొత్త నేతలే పోటీలో దిగుతారా ? అన్నది చూడాలి.

ఇఖ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో గతంలో అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ సారి కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డిని ఓడించాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. బలమైన నేతను బరిలో దింపాలని యోచిస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను బరిలో దించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ సీటు కోసం బల్ధియా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, దానం నాగేందర్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్నూరు కాపు, యాదవ, క్రిస్టియన్, ముస్లీం మైనార్టీ ఓట్లతో బీజేపీని దెబ్బకొట్టవచ్చని కాంగ్రెస్ లెక్కలు వేస్తొంది. లష్కర్ లో కాంగ్రెస్ లెక్కలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి..!

ఇక చేవెళ్ల పార్లమెంట్ గతంలో కాంగ్రెస్ కు గట్టి పట్టుంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి ఇక్కడ నుంచి 2009లో విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేవలం 20 వేల ఓట్ల స్వల్ప మేజార్టీతో జారవిడుచుకుంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి సై అంటున్నారు. మొన్నటివరకు ఇక్కడ వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సునీతామహేందర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో సమీకరణాలు మారిపోయాయి. సునీతారెడ్డిని మల్కాజిగిరికి షిఫ్ట్ చేసి…రంజిత్ రెడ్డిని పోటీలో దింపేందుకు కాంగ్రెస్ పార్టీ స్కెచ్ రెడీ చేసింది. కార్యక్షేత్రంలో కండువా మార్చి ఎన్నికల బరిలో దిగుతున్న రంజిత్ రెడ్డిని చేవెళ్ల ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాలి.

అటు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ వ్యూహం ఏంటనేది అంతుచిక్కడం లేదు. మజ్లీస్ పార్టీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భాగ్యనగరంపై కాంగ్రెస్ ఫోకస్ పెడుతుందా? లేదా? అన్నది కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలను ఎంఐఎం గెలవగా.. ఒక స్థానంలో బీజేపీ గెలిచింది. పార్లమెంట్ స్థానంలో క్యాడర్ ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఎలాంటి ఎత్తుగడలను అవలంభిస్తుందో చూడాలి.

ఆర్థికంగా బలంగా ఉన్న నేతలనే ఎన్నికల బరిలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. సామాజిక సమీకరణాలు.. స్థానిక పరిస్థితులు.. సీనియర్ల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సవాళ్లను ఎదుర్కొంటుంది. కొత్తగా చేరిన వారికి టికెట్లు కేటాయించవద్దని పాత నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని మిస్ చేయకండి!
సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని మిస్ చేయకండి!
విజయవాడలో ఘోరం.. గొంతు కోసుకుని డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్!
విజయవాడలో ఘోరం.. గొంతు కోసుకుని డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్!
ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!
ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!
ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ
ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ
సమ్మర్‌లో జామపండు తింటే.. అలసటకు బైబై చెప్పొచ్చు!
సమ్మర్‌లో జామపండు తింటే.. అలసటకు బైబై చెప్పొచ్చు!
గ్లాసు సింబల్‌ కేటాయింపు, కూటమి ఓట్లకు గండి పడేనా..?
గ్లాసు సింబల్‌ కేటాయింపు, కూటమి ఓట్లకు గండి పడేనా..?
వేలంలో వేస్ట్ అని వదిలేశారు.. కట్ చేస్తే.. ఆ జట్టుకే హిట్టింగ్.!
వేలంలో వేస్ట్ అని వదిలేశారు.. కట్ చేస్తే.. ఆ జట్టుకే హిట్టింగ్.!
తల్లి అయ్యేందుకు ట్రై చేస్తున్న మెహ్రీన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో..
తల్లి అయ్యేందుకు ట్రై చేస్తున్న మెహ్రీన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో..
పోలింగ్ జరగకుండానే బీజేపీ ఖాతాలో చేరనున్న 3 లోక్‌సభ సీట్లు!
పోలింగ్ జరగకుండానే బీజేపీ ఖాతాలో చేరనున్న 3 లోక్‌సభ సీట్లు!
ఫిట్‌గా మారిన టీమిండియా ఫ్యూచర్ బుమ్రా.. ముంబైకి మరో ఓటమి పక్కా?
ఫిట్‌గా మారిన టీమిండియా ఫ్యూచర్ బుమ్రా.. ముంబైకి మరో ఓటమి పక్కా?