Telangana: ఆ జిల్లాపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్.. గెలుపు కోసం కొత్త వ్యూహం ఇదే..
ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఆ జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ కొంత వీక్‌గా ఉందో ఆ నియోజకవర్గలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం 10 నియోజకవర్గలకుగాను 7 నియోజకవర్గల్లో బీఆర్ఎస్ గెలించింది.
ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఆ జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ కొంత వీక్‌గా ఉందో ఆ నియోజకవర్గలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం 10 నియోజకవర్గలకుగాను 7 నియోజకవర్గల్లో బీఆర్ఎస్ గెలించింది. అయితే వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా ఈ జిల్లాలో తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఈ మూడు సెగ్మెంట్లలో అధిక ఓట్లు సాధించేందుకు పావులు కదుపుతోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు మొత్తం 80 వేల ఓట్లు మాత్రమే రావడం వల్ల రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే విషయాన్ని ముందుగానే గుర్తించారు కాంగ్రెస్ పార్టీ నేతలు.
ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ స్థానాలున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ మినహా ఆరు స్థానాల్ని బీఆర్ఎస్ గెలుచుకుంది. మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు గణనీయంగా ఓట్లు పడ్డా మిగిలిన మూడు చోట్ల నామమాత్రంగానే ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చేలా ప్లాన్ వేస్తున్నారు. ఈ మూడు సెగ్మంట్లలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు ఉన్నా సరైన నాయకత్వం లేకపోవడమే ఓటింగ్ శాతం పడిపోవడానికి కారణంగా గుర్తించారట సీనియర్ నేతలు. అందుకే 2009 పార్లమెంటు ఎన్నికల్లో ఆరు సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి 40 వేల మెజార్టీ సాధించినా సిద్దిపేటలో వచ్చిన ఓట్లతో ఫలితం తారుమారై ఎంపీగా విజయశాంతి గెలవడాన్ని గుర్తు చేసుకున్నారు. ఈసారి ఆ పరిస్థితి పురావృతం కాకుండా చూడాలని భావిస్తున్నారట హస్తం నేతలు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు రెండు లక్షలపై చిలుకు ఓట్లు పొందాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు ముందుకు సాగుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలను కలుపుకుని కాంగ్రెస్ అభ్యర్థులకు 80,905 ఓట్లు పొలైతే బీఆర్ఎస్ అభ్యర్థులకు 3,14,755 ఓట్లు పొలయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పొలైన ఓట్లతో పాటు అదనంగా మరో రెండు లక్షల ఓట్లు సాధించాలనే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనేతలు కలిసిమెలసి లేకపోవడం వల్లే పార్టీ నష్టపోయింది అని, ఎంపీ ఎన్నికల్లో కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు అని భావిస్తోంది. దీనికి తోడు ఉమ్మడి మెదక్ జిల్లా అంటే కేసీఅర్, హరీష్ రావు అడ్డ అని, ఎంపీ ఎన్నికల బాధ్యత మొత్తం ఇక్కడ హరీష్ రావు చూసుకుంటున్నారని ప్రచారం ఉంది. అందుకే కాంగ్రెస్ నేతలు ఎప్పుడు అలెర్ట్‌గా ఉండాలి అని సూచనలు చేస్తున్నారట సీనియర్లు నాయకులు. మరో వైపు కింద స్థాయి లీడర్లలో ఐకమత్యం లేకపోతే అధిష్టానం ఎన్ని ప్లాన్లు వేసిన లాభం లేదని భావిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఈ మూడు నియోజకవర్గలపై కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..