Revanth Reddy: మేడిగడ్డ ప్రాజెక్టుపై జ్యుడిషియల్ విచారణ.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సవాళ్లు..ప్రతిసవాళ్లతో వేడెక్కింది..తెలంగాణ రాజకీయం. నల్లగొండ వేదికగా కృష్ణాజలాలపై బీఆర్‌ఎస్ అధినేత ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. ఇక తగ్గేదే లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అటు సీఎం రేవంత్‌రెడ్డి సైతం మేడిగడ్డ వేదికగా.. బీఆర్‌ఎస్‌పై సమరనాదం వినిపించారు. అన్ని పాపాలకు కేసీఆరే కారణమని ఆరోపించారు. అవినీతిపై చర్చ జరగకూడదనే అసెంబ్లీకి రాకుండా నల్గొండకు వెళ్లారని ఫైర్ అయ్యారు. ఇలా KRMBకి ప్రాజెక్టుల అప్పగింతపై నిన్న చర్చ.. రచ్చ జరిగితే.. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో మేడిగడ్డ ఇష్యూపై మాటల యుద్ధం కొనసాగింది.
సవాళ్లు..ప్రతిసవాళ్లతో వేడెక్కింది..తెలంగాణ రాజకీయం. నల్లగొండ వేదికగా కృష్ణాజలాలపై బీఆర్‌ఎస్ అధినేత ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. ఇక తగ్గేదే లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అటు సీఎం రేవంత్‌రెడ్డి సైతం మేడిగడ్డ వేదికగా.. బీఆర్‌ఎస్‌పై సమరనాదం వినిపించారు. అన్ని పాపాలకు కేసీఆరే కారణమని ఆరోపించారు. అవినీతిపై చర్చ జరగకూడదనే అసెంబ్లీకి రాకుండా నల్గొండకు వెళ్లారని ఫైర్ అయ్యారు. ఇలా KRMBకి ప్రాజెక్టుల అప్పగింతపై నిన్న చర్చ.. రచ్చ జరిగితే.. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో మేడిగడ్డ ఇష్యూపై మాటల యుద్ధం కొనసాగింది. మేడిగడ్డలో భారీ అవినీతి జరిగిందని.. డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయని ఆరోపించారు మంత్రి శ్రీధర్‌బాబు. ప్రాజెక్టుల ద్వారా వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని..కానీ భూములు ఇచ్చిన రైతులకు మాత్రం న్యాయం జరగలేదన్నారు. దేవాలయాలు ఎంత పవిత్రమైనవో.. రైతులకు ప్రాజెక్టులూ అంతేనన్నారు..సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీడిజైన్ అనే బ్రహ్మపదార్థాన్ని కనిపెట్టారని సెటైర్లు వేశారు. 38 వేల 500 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును 1 లక్షా 47 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. అంచనాలు ఎలా పెంచారు? రీడిజైనింగ్ ఎలా చేశారు? సాంకేతికపరమైన అంశాలు ఏమున్నాయి? నిపుణులు ఇచ్చిన డీపీఆర్ ఎక్కడ? అనే ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నల్లాగే మిగిలాయన్నారు.
నల్గొండ సభకు ఎలా వెళ్లారు..? నల్గొండ దగ్గర ఉందా..? శాసన సభ దగ్గరుందా..? దోపిడీ వల్ల మేడిగడ్డ బలైంది.. అన్నారం సిందిల్ల సున్నం అయ్యాయంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్వార్ధం వీడి.. ప్రతిపక్ష నాయకుడు హోదాను గౌరవంగా నిర్వర్తించండంటూ సూచించారు. హరీష్ రావు లాంటి వారికి ఆ పార్టీలో విలువలేదు.. అందుకే అసెంబ్లీకి కెసిఆర్ రావాలని కోరామాన్నారు. మమ్మల్ని బెదిరించి బతకాలని చూస్తున్నారు.. కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే ఎందుకు మొఖం చాటేస్తున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చి Krmbపై మీ అనుభవాన్ని తెలపాలంటూ సూచించారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని కొత్త డ్రామాలు మొదలు పెట్టారంటూ విమర్శించారు. మేడిగడ్డ సందర్శనకు చీకటి మిత్రులు బీజేపీ mla లు కూడా ఎవరు రాలేదన్నారు. బీజేపీ mlaలు వస్తారు అనుకున్నాం.. ఇద్దరి నైజం ఒక్కటేన్నారు. బీజేపీ కెసిఆర్ అవినీతిని నిలదీస్తారా..? కాపాడుతారా..? అంటూ ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై జ్యుడిషియల్ విచారణకు నిర్ణయించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ cbi విచారణకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కెసిఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ రోజు వరంగల్ కు వచ్చిన కిషన్ రెడ్డి మేడిగడ్డ కు ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు.
మేడిగడ్డ బ్యారేజీ కింద ఇసుక కదలడం వల్లే కుంగిపోయిందని గత పాలకులు చెప్పారన్న రేవంత్‌రెడ్డి.. ఇసుక కదిలేలా పేకమేడలు నిర్మించారా అని ప్రశ్నించారు. బ్యారేజీ వద్దకు ఎవరూ వెళ్లకుండా.. చూడనీయకుండా పోలీసు పహారా పెట్టారని ఆరోపించారు. ప్రాజెక్టుల వద్ద ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించి రెండు మూడు రోజుల్లో శ్వేత పత్రం విడుదల చేస్తామని స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి.
అజెండాలో లేని అంశంపై మాట్లాడారు.. హరీష్ రావు..
అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.. మాజీ మంత్రి హరీష్‌రావు. అజెండాలో లేని అంశంపై సీఎం మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్ ఇచ్చారు. గత కాంగ్రెస్ హయాంలో ఫ్లైఓవర్లు కూడా కూలిపోయాయన్నారు. కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు సరి చేయాలి కానీ రాజకీయం చేయొద్దన్నారు. మేడిగడ్డపై అసెంబ్లీలో చర్చిస్తామని.. ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం కూడా విడుదలచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో.. సభలో జల సమరం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..