Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Environment: ప్రకృతి, పర్యావరణం రక్షించాలంటూ.. బాధ్యతను భుజాన వేసుకున్న ప్రభుత్వ టీచర్

మానవ మనుగడలో అతి పెద్ద భూతం ప్లాస్టిక్.. మారుతున్న కాలానుగుణంగా వాడకలోకి వచ్చిన ప్లాస్టిక్ మానవ మనుగడకే సవాల్ విసురుతోంది. మనిషి జీవనంలో ఎన్నో రకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. పంచభూతాల్లో ఈ ప్లాస్టిక్ అంతర్భాగమై జీవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. మనిషి పుట్టుక నుంచి మరణించే వరకు ప్రతి సందర్భంలో ఈ ప్లాస్టిక్ భూతం మనల్ని వెంటాడుతోంది. అలాంటి ప్లాస్టిక్ ఉపయోగానికి వ్యతిరేకంగా ఓ ప్రభుత్వ అధ్యాపకుడు వింత ప్రచారానికి సిద్దమయ్యారు.

Environment: ప్రకృతి, పర్యావరణం రక్షించాలంటూ.. బాధ్యతను భుజాన వేసుకున్న ప్రభుత్వ టీచర్
Teacher Bhaskar
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Feb 13, 2024 | 7:42 PM

మానవ మనుగడలో అతి పెద్ద భూతం ప్లాస్టిక్.. మారుతున్న కాలానుగుణంగా వాడకలోకి వచ్చిన ప్లాస్టిక్ మానవ మనుగడకే సవాల్ విసురుతోంది. మనిషి జీవనంలో ఎన్నో రకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. పంచభూతాల్లో ఈ ప్లాస్టిక్ అంతర్భాగమై జీవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. మనిషి పుట్టుక నుంచి మరణించే వరకు ప్రతి సందర్భంలో ఈ ప్లాస్టిక్ భూతం మనల్ని వెంటాడుతోంది. అలాంటి ప్లాస్టిక్ ఉపయోగానికి వ్యతిరేకంగా ఓ ప్రభుత్వ అధ్యాపకుడు వింత ప్రచారానికి సిద్దమయ్యాడు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ అధ్యాపకుడు భాస్కర్ తెలకపల్లి హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వృత్తి ధర్మంగా పిల్లలకు లెక్కల పాఠాలు చెబుతూనే సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్‌పై పోరాటానికి తనవంతు కృషి చేస్తున్నారు. సామాజిక మానవ జీవన మనుగడలో ప్లాస్టిక్ ఉపయోగంలో ఎంత అవరోధాలు ఎదురవుతున్నాయో, ప్లాస్టిక్ ఉపయోగం వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో తెలియజేస్తున్న ఆయన వాయిస్ రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

రేపటి తరాన్ని మరిచి విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడుతుంది నేటి తరం. జీవకోటికి, మానవాళికి ఇబ్బందులు గురిచేస్తున్నారు అంటూ ఒక వాయిస్ మెసేజ్ లో పేర్కొన్నాడు ఉపాధ్యాయుడు. మనం పుట్టినప్పుడు నుండి చావు వరకు జరుపుకుంటున్న వేడుకల్లో ప్రతి ఒక్క వస్తువు ప్లాస్టిక్ తో కూడిన పదార్థాలు వాడుతూ దానికి సింగిల్ యూస్ ప్లాస్టిక్ అని పేరు పెట్టారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ మట్టి పాలు చేస్తున్నామని అనుకుంటున్నాము. కానీ అది మట్టి పాలు కాక మనమే రేపటి తరానికి మరణ హోమం రగిలిస్తున్నాం. మహాత్ముడు తెలియజేసిన పర్యావరణ పరిరక్షణ మానవాళికి రక్ష అనే సిద్ధాంతాన్ని మరచి ఎక్కడబడితే అక్కడ ప్లాస్టిక్ వినియోగం చేస్తున్నామంటూ తన వాయిస్ రికార్డ్ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు భాస్కర్.

మన ముందు తరాలు ఎలా బతికారు మన రేపటి తరాలు కూడా ఆలా బతికేలా చేద్దాం అంటున్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కి బదులుగా వెదురుకు, కలప సంబంధించిన వస్తువులను, మట్టి పాత్రలు వాడుతూ ఆర్గానిక్ సంబంధించిన వస్తువులు వినియోగిద్దాం అంటూ హితవు పలికాడు ఆ ఉపాధ్యాయుడు. చివరి మాటగా రూసో చెప్పిన విధంగా ప్రకృతిలోకి వెళ్దాం…పరవశించి ఆరోగ్యంగా జీవిద్దాం అంటూ వాయిస్ సందేశం ముగించాడు.

ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించాలన్న గొప్ప బాధ్యతను భుజాన వేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని నాగర్ కర్నూల్ జిల్లా వాసులు అభినందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…