Horoscope Today: వృత్తి, వ్యాపారాల్లో వారికి కీలక సమస్యలు పరిష్కారం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 14, 2024): మేష రాశి వారి ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలతో లాభం పొందుతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ప్రతిఫలాలు ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వృత్తి, వ్యాపారాల్లో వారికి కీలక సమస్యలు పరిష్కారం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 14th February 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 14, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 14, 2024): మేష రాశి వారి ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలతో లాభం పొందుతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ప్రతిఫలాలు ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. సానుకూల దృక్పథంతో వ్యవ హరించడం మంచిది. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. విదేశాల నుంచి శుభ సమాచారం అందుకుంటారు. మిత్రుల వల్ల డబ్బు నష్టం జరుగు తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలతో లాభం పొందుతారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. మిత్రు లతో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. స్థిరాస్తి సంబంధమైన వివాదం నుంచి బయట పడతారు. ఇంటా బయటా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరి విషయంలోనూ తల దూర్చ వద్దు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ప్రతిఫలాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సమాజంలో గౌరవాభిమానాలు పెరు గుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు ఆశిం చిన ప్రయోజనం పొందుతారు. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవా లేదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగు తుంది. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుం టారు. కీలక వ్యవహారాల్లో స్నేహితులు అండగా నిలబడతారు. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తు లతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. దాదాపు అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోకుండా డిమాండ్ పెరుగుతుంది. రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. రహస్యంగా ఉంచాల్సిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ హామీలు ఉండ వద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో కోరుకున్నది సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కోరుకున్న పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుం బంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొద్దిపాటి శ్రమతో అధిక లాభం పొందుతారు. నిరుద్యోగులు సొంత ఊర్లో మంచి ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సతీమణి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ఆదరణ లభిస్తుంది. సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. లాభదాయకమైన పరిచ యాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు అతి తేలికగా పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సతీమణి పాయంతో ఒకటి రెండు కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఎవరికీ హామీలు ఉండ వద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక సమస్యలు పరి ష్కారం అవుతాయి. లాభాలు పెరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితులు ఆశించిన మేరకు మెరుగు పడతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదాలకు పరిష్కారం లభించవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన సానుకూల మార్పులు చోటు చేసు కుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలు పరిష్కారం అవుతాయి. తండ్రి జోక్యంతో స్థిరాస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఎవరికీ ఎటు వంటి వాగ్దానాలూ చేయవద్దు. కొందరు దగ్గర వ్యక్తులు తప్పుదోవ పట్టించే సూచనలున్నాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. సతీమణితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. పిల్లల చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయపరంగా కొత్త ప్రయ త్నాల మీద దృష్టి సారిస్తారు. రాజకీయంగా ప్రాముఖ్యం పెరిగి క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర పరి చయాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది.

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?