Jeevan Reddy: కేసీఆర్‌ ఉద్యోగ ప్రకటనతో ఒరిగేదేమీ లేదు.. ముఖ్యమంత్రిపై మండిపడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి..

ఉద్యోగాల భర్తీలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) ఆర్భాటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి (Jeevan Reddy )విమర్శించారు.

Jeevan Reddy: కేసీఆర్‌ ఉద్యోగ ప్రకటనతో ఒరిగేదేమీ లేదు.. ముఖ్యమంత్రిపై మండిపడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి..
Jeevan Reddy
Follow us
Basha Shek

|

Updated on: Mar 09, 2022 | 12:26 PM

ఉద్యోగాల భర్తీలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) ఆర్భాటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి (Jeevan Reddy )విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏర్పడిన ఖాళీలు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ దుయ్యబట్టారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్లో జీవన్ రెడ్డి మాట్లాడారు. ‘ బిశ్వాల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో1.91లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడేమో కేవలం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. వేల మంది విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది. వారికి ఈ ప్రకటన ఏ మాత్రం ప్రయోజనం చేకూరదు.’

‘అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ఒక ఏడాది వెనక్కి నడుస్తోంది. తెలంగాణలో జిల్లాలు పెరిగినప్పుడు, ఉద్యోగలు, ఖాళీలు కూడా పెరగాలి. జోనల్‌ విధానంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు కేసీఆర్‌ సర్కార్‌ ఎందుకింత జాప్యం చేస్తుందో అర్థం కావడం లేదు. ఇక నిరుద్యోగ భృతిని ఇస్తామని గతంలో  టీఆర్ఎస్ సర్కార్ హామీ ఇచ్చింది. కేసీఆర్ దీనిపై నోరు మెదపడం లేదు . ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నాయో తెలంగాణ ఏర్పడ్డాక మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి’ అని జీవన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్‌ మొత్తం 80,039 ఉద్యోగాలకు ఉన్న పళంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా 95 శాతం ఉద్యోగాలకు స్థానికులకే కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Also Read:Beauti Tips: అందమైన పెదాల కోసం అదిరే చిట్కాలు.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి..!

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ‘స్వింగ్ ప్రైసింగ్’ అంటే ఏమిటి.. పూర్తి వివరాలు మీకోసం..

Telangana Jobs: 80వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ప్రకటన.. జోన్లు, మల్టీ జోన్లు, శాఖలవారీగా ఖాళీల వివరాలు ఇవే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!