Telangana Jobs: 80వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ప్రకటన.. జోన్లు, మల్టీ జోన్లు, శాఖలవారీగా ఖాళీల వివరాలు ఇవే..

నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీపికబురు అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్‌, మల్టీజోనల్‌, సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి.

Telangana Jobs: 80వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ప్రకటన.. జోన్లు, మల్టీ జోన్లు, శాఖలవారీగా ఖాళీల వివరాలు ఇవే..
Cm Kcr
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 09, 2022 | 11:31 AM

CM KCR announces Jobs Notification: నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీపికబురు అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్‌, మల్టీజోనల్‌, సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి.

రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..

గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు గ్రూప్‌ 2- 1,373 ఉద్యోగాలు గ్రూప్‌ 4- 9,168 పోస్టులు

క్యాడర్ వారీగా ఖాళీలు..

జిల్లాల్లాలో – 39,829 జోన్లలో – 18,866 మల్టీజోనల్‌ పోస్టులు – 13,170 సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో – 8,147

జిల్లాల వారీగా ఖాళీలు..

హైదరాబాద్ – 5,268 నిజామాబాద్ – 1,976 మేడ్చల్ మల్కాజ్‌గిరి – 1,769 రంగారెడ్డి – 1,561 కరీంనగర్ – 1,465 నల్లగొండ – 1,398 కామారెడ్డి – 1,340 ఖమ్మం – 1,340 భద్రాద్రి కొత్తగూడెం – 1,316 నాగర్‌కర్నూల్ – 1,257 సంగారెడ్డి- 1,243 మహబూబ్‌నగర్- 1,213 ఆదిలాబాద్ – 1,193 సిద్దిపేట – 1,178 మహబూబాబాద్ – 1,172 హనుమకొండ – 1,157 మెదక్ – 1,149 జగిత్యాల – 1,063 మంచిర్యాల – 1,025 యాదాద్రి భువనగిరి – 1,010 జయశంకర్ భూపాలపల్లి – 918 నిర్మల్ – 876 వరంగల్ – 842 కుమ్రం భీం ఆసీఫాబాద్ – 825 పెద్దపల్లి – 800 జనగాం – 760 నారాయణపేట్ – 741 వికారాబాద్ – 738 సూర్యాపేట – 719 ములుగు – 696 జోగులాంబ గద్వాల – 662 రాజన్న సిరిసిల్ల – 601 వనపర్తి – 556

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

కాళేశ్వరం జోన్‌లో – 1,630 బాసర జోన్‌ – 2,328 రాజన్న జోన్‌ – 2,403 భద్రాద్రి జోన్‌ – 2,858 యాదాద్రి జోన్‌ – 2,160 చార్మినార్ జోన్‌ – 5,297 జోగులాంబ జోన్‌ – 2,190

మల్టీజోన్లు..

మల్టీజోన్ 1 – 6,800 మల్టీజోన్ 2 – 6,370

ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు..

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.

శాఖల వారీగా ఖాళీల వివరాలు..

హోం శాఖ – 18,334 సెకండరీ ఎడ్యుకేషన్ – 13,086 హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ – 12,755 హయ్యర్ ఎడ్యుకేషన్ – 7,878 బీసీల సంక్షేమం – 4,311 రెవెన్యూ శాఖ – 3,560 ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ – 2,879 నీటిపారుదల శాఖ – 2,692 ఎస్టీ వెల్ఫేర్ – 2,399 మైనారిటీస్ వెల్ఫేర్ – 1,825 ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ – 1,598 పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ – 1,455 లేబర్, ఎంప్లాయీమెంట్ – 1,221 ఆర్థిక శాఖ – 1,146 మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ – 895 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ – 859 అగ్రికల్చర్, కో-ఆపరేషన్ – 801 రవాణా, రోడ్లు, భవనాల శాఖ – 563 న్యాయశాఖ – 386 పశుపోషణ, మత్స్య విభాగం – 353 జనరల్ అడ్మినిస్ట్రేషన్ – 343 ఇండస్ట్రీస్, కామర్స్ – 233 యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్ – 184 ప్లానిం గ్- 136 ఫుడ్, సివిల్ సప్లయిస్ – 106 లెజిస్లేచర్ – 25 ఎనర్జీ – 16