Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MEIL: ONGCకి అత్యాధునిక ల్యాండ్ రిగ్ డెలివరీ చేసిన మేఘా సంస్థ.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ..

MEIL: మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రిగ్‌ల డెలివరీని వేగవంతం చేసింది. 2,000-HP ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్‌ను ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) రాజమండ్రికి దానిని అందించింది.

MEIL: ONGCకి అత్యాధునిక ల్యాండ్ రిగ్ డెలివరీ చేసిన మేఘా సంస్థ.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ..
MEIL Rig
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 09, 2022 | 1:36 PM

MEIL: మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రిగ్‌ల డెలివరీని వేగవంతం చేసింది. 2,000-HP ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్‌ను ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) రాజమండ్రికి దానిని అందించింది. ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్న ఈ భారీ డ్రిల్లర్ తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయిల్ & గ్యాస్ వెలికి తీసేందుకు తోడ్పడనుంది. స్వదేశీ అత్యుత్తమ తరగతి లక్షణాలతో అత్యాధునికంగా తయారు చేసిన చమురు రిగ్ ఇది. ప్రపంచంలోనే అత్యుత్తమ పరిజ్ఞాన్ని వినియోగించి దీనిని సిద్ధం మేఘా రూపొందించింది. ఈ 2,000-HP రిగ్ 3,000-HP సాంప్రదాయ రిగ్‌కు సమానమైన పనితీరును అందించగలదని కంపెనీ తెలిపింది. విజయవంతంగా నిర్వహించబడుతున్న ఈ స్వదేశీ రిగ్.. భూమిలోకి 6,000 మీటర్లు (6 కిమీ) లోతు వరకు డ్రిల్ చేసేందుకు ఈ రిగ్ అవకాశాన్ని కల్పించనుంది.

రాజమండ్రిలో ఉన్న అత్యాధునిక రిగ్

రాజమండ్రిలో ఉన్న అత్యాధునిక రిగ్

ఇప్పటి వరకు మేఘా సంస్థ భూమిని డ్రిల్ చేసే 10 రిగ్ లను విజయవంతంగా వివిధ కంపెనీలకు డెలివరీ చేసింది. వాటిలో మూడు ఇప్పటికే వినియోగంలో ఉండగా.. మిగిలినవి ఇన్టలేషన్ చివరి భాగంలో ఉన్నాయి. రానున్న 4 నుంచి 5 వారాల్లో ఈ రిగ్ లు వాడుకలోకి వస్తాయని సంస్థ వెల్లడించింది. అదే సమయంలో, MEIL మెహ్సానా, అహ్మదాబాద్, అంకలేశ్వర్, అగర్తల, శిబ్‌సాగర్ ONGC ఫీల్డ్‌లకు ఐదు వర్కోవర్ రిగ్‌లలో 1వ లాట్‌ను సరఫరా చేసింది. ఈ 1వ లాట్ ఐదు రిగ్‌లు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 2వ లాట్ 5 రిగ్‌లు కూడా తయారీలో కీలక దశలో ఉన్నాయి.

ఇప్పటి వరకు సంస్థ కేవలం ONGC నుంచి 47 రిగ్ ల సరఫరా ఆర్డర్ ను పొందింది. వాటిలో 20 వర్కోవర్ రిగ్‌లు కాగా.. మిగిలిన 27 భూమిని డ్రిల్లింగ్ చేసేందుకు ఉపయోగించే రిగ్గులు ఉన్నాయి. వీటిని అందించటంలో ఎటువంటి ఆలస్యానికి చోటు లేకుండా పూర్తి ఆటోమేషన్ పద్ధతిలో కంపెనీ ఉత్పత్తిని చేస్తోంది. రానున్న కాలంలో దేశంలో ఆయిల్, గ్యాస్ బావుల తవ్వకంలో ఈ మెషీన్లు కీలకంగా మారనున్నాయని కంపెనీ వెల్లడించింది. కరోనా మహమ్మారి అడ్డంకులు కలిగిస్తున్నా.. తమకు తయారీలో ఉన్న పూర్వపు అనుభవంతో, అంకిత భావంతో ముందుకు సాగుతున్నట్లు మేఘా వివరించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఉత్పత్తికి అవసరమైన వివిధ భాగాలను తెప్పించుకోవటంలో అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ.. సమయానికి రిగ్ లను అందిస్తామని ధీమా వ్యక్తం చేసింది.

కొవిడ్ వ్యాప్తి చెందే దశలో ఉన్నప్పటికీ చెప్పినట్లుగానే రిగ్ ల తయారీని వేగవంతం చేసినట్లు ఎంఈఐఎల్‌ రిగ్స్‌ ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ హెడ్‌ కె. సత్య నారాయణ వెల్లడించారు. పవర్ సెక్టార్, అప్‌స్ట్రీమ్- డౌన్‌స్ట్రీమ్ రెండింటిలోనూ కంపెనీ కీలక పాత్ర ఉంది. ఈ అత్యాధునిక ఆయిల్ రిగ్‌లు ప్రపంచంలోనే అత్యుత్తమైన, అత్యంత అధునాతన హైడ్రాలిక్ సాంకేతిక లక్షణాలను కలిగి ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ఇంధన రంగానికి అధునాతన రిగ్‌లు చాలా కీలకమైనవని.. దేశీయ అవసరాల కోసం చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు ఇవి ఉపకరిస్తాయని ఆయన స్పష్టం చేశారు. “మేక్ ఇన్ ఇండియా” మరియు “ఆత్మనిర్భర్ భారత్” కార్యక్రమాల క్రింద స్వదేశీ సాంకేతికతతో అత్యంత సమర్థవంతమైన ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్‌లను తయారు చేయడంలో భారతదేశంలో MEIL మొదటి ప్రైవేట్ ప్లేయర్ నిలిచిందని సత్య నారాయణ తెలిపారు.

ఇవీ చదవండి..

Inheritance rights: ఆస్తి వారసత్వ హక్కులు అన్ని మతాల మహిళలకు ఒకటేనా.. చట్టం ఏమి చెబుతోంది..

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ‘స్వింగ్ ప్రైసింగ్’ అంటే ఏమిటి.. పూర్తి వివరాలు మీకోసం..

Indian Markets: భయాల నుంచి బయటపడుతున్న మార్కెట్లు.. ఫోకస్ లో ఉన్న ఆ కంపెనీల షేర్లు..