ఘాటులోనే కాదు ధరలోనూ తగ్గేదే లే.. రికార్డు స్థాయిలో మిర్చి రేటు.. డిమాండ్ పెరగడానికి కారణాలివే
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా వ్యవసాయ పంటల ధరలు రికార్డుకెక్కాయి. ఘాటులోనే కాదు.. ధరలోనూ ఏ మాత్రం తగ్గేదే లే అంటోంది మిర్చి. మంగళవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Agriculture Market) కు వచ్చిన సింగిల్ పట్టి రకం...
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా వ్యవసాయ పంటల ధరలు రికార్డుకెక్కాయి. ఘాటులోనే కాదు.. ధరలోనూ ఏ మాత్రం తగ్గేదే లే అంటోంది మిర్చి. మంగళవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Agriculture Market) కు వచ్చిన సింగిల్ పట్టి రకం మిర్చి ధర రికార్డు(Chilli Record Price) ధర పలికింది. క్వింటాలుకు రూ.40వేలు పలకడంతో అన్నదాతలు ఆనందంలో మునిగిపోయారు. కొన్ని నెలలుగా బహిరంగ మార్కెట్ లో మిర్చి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో సాధారణంగా పది, లేదా పదిహేను వేల రూపాయల మధ్యలో ఉండే మిర్చి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చపాటా రకం మిర్చికి కూడా అధిక డిమాండ్ పలికింది. ఈ రకం మిర్చి క్వింటాలుకు రూ.32 వేలు పలుకుతోంది. అయితే సింగిల్ పట్టి(Single Patti type Chilli), చపాటా రకాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. పచ్చళ్లు, ప్రముఖ బ్రాండ్ల కారం పొడి తయారీలో వీటిని అధికంగా వినియోగిస్తారు. ఫలితంగా వీటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ ధరలు రైతులకు ఆనందం కలిగించేది అయినప్పటికీ.. వారు నిరాశలోనే ఉన్నారు. ధర పెరుగుతున్నా ఆ స్థాయిలో ఉత్పత్తి రావడం లేదు. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు దాదాపు మిర్చి పంటలన్ని నాశనం అయ్యాయి. దీంతో దిగుబడి రాలేదు. తద్వారా కొన్ని ప్రత్యేక రకాల మిర్చితో పాటు సాధారణ మిర్చి రకానికి కూడా కనీస ధర 15 వేల రూపాయలకు పైనే ఉండడం రైతులకు ఊరట కలిగిస్తోంది. మరోవైపు పత్తికి సైతం ఇదే రకమైన ధరలు పలుకుతున్నాయి. పత్తికి క్వింటాలుకు గరిష్ఠంగా రూ.10,100 ధర పలికింది.
ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలు, వైరస్ తెగులు వంటి ప్రకృతి వైపరీత్యాలతో మిర్చి పంట బాగా దెబ్బతింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. వైరస్.. మిరప పంటను దెబ్బ తీసిన కారణంగా దిగుబడి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకాయి. మిర్చి ధరలు బహిరంగ మార్కెట్‌లో రికార్డులు నమోదు చేసినప్పటికీ ఎక్కువ దిగుబడి లేకపోవడంతో కొంతమేర రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో ఎర్ర బంగారం విక్రయించేందుకు రైతులు వస్తూ ఉంటారు. రెండో కోత చేతికి రావడంతో రైతులు పంటను మార్కెట్‌కు తరలిస్తున్నారు. గతేడాది ఎకరాకు 20 నుంచి 30 క్వింటాలు వరకు దిగుబడి వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి రావడమే ఎక్కువైంది. ఇతర దేశాలకు మిర్చిని ఎగుమతి చేస్తున్నందున ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
Beauti Tips: అందమైన పెదాల కోసం అదిరే చిట్కాలు.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి..!
Viral Photo: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులను గుర్తుపట్టారా..? ఇండియాలోనే వారిప్పుడు టాప్ వ్యాపారవేత్తలు..