Congress LS Candidates: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు ఆ పార్టీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వయనాడ్‌ నుంచే పోటీ చేయబోతున్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుంది..

Congress LS Candidates: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..
Telangana Congress
Follow us

|

Updated on: Mar 08, 2024 | 7:44 PM

వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 8వ తేదీ శుక్రవారం కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో జహీరాబాద్, మహబూబ్ నగర్‌, నల్గొండ, మహబూబాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి.

  • జహీరాబాద్- సురేష్ కుమార్ షెట్కార్
  • మహబూబ్ నగర్‌- చల్లా వంశీచంద్ రెడ్డి
  • నల్గొండ- కుందూరు రఘువీర్
  • మహబూబాబాద్-(ఎస్టీ)- బలరాం నాయక్ పోరిక

అభ్యర్థుల నేపథ్యం

సురేష్ కుమార్ షెట్కార్ జహీరాబాద్ పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు 15వ లోక్ సభ సభ్యునిగా ఉన్నారు. 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా నియమితులయ్యారు. 2004-2009 వరకు నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.

పి బలరామ్ నాయక్, జూన్ 2009 నుండి మే 2014 వరకు 15వ లోక్‌సభ సభ్యునిగా పనిచేశారు. పూర్వ ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.  బలరామ్ నాయక్ తొలుత పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. 2009లో పాలిటిక్స్‌లో ఎంటరయ్యారు.

ఇక మహబూబ్ నగర్‌ నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డిని బరిలోకి దింపింది కాంగ్రెస్. 2014లో ఆయన భారతదేశంలోని కల్వకుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఇక నల్గొండ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి తనయుడు కె. రఘువీర్‌కు ఆ పార్టీ టికెట్‌ దక్కింది.

39 మంది అభ్యర్థుల లిస్ట్ దిగువన చూడండి…