AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సెల్ఫ్ ప్రమోషన్ అంతే.. ఆమెకంత సీన్ లేదు… మాధవీలతపై కరాటే కళ్యాణి ఫైర్

పాతబస్తీ బీజేపీలో కరాటే ఫైట్ షురూ ఐంది. మాధవీలత వర్సెస్ కరాటే కళ్యాణి.. కమలం పార్టీలో ఇదొక ఇంటర్నల్ ఫైట్. మగాళ్లే దొరకలేదా అని మొన్నొకరంటే.. దొరికిన మహిళ కూడా కరెక్ట్‌ ఛాయిస్ కాదు అని ఇవాళ మరొక వాయిస్ వినిపిస్తోంది. పోరాడి గెలుస్తా.. చరిత్ర సృష్టిస్తా అని మాధవీలత ముందుకెళ్తుంటే.. సొంత పార్టీ వాళ్లే వెనక్కు లాగుతున్నారు. ఈ పాతబస్తీ బీజేపీ చుట్టూ జరుగుతున్న ఈ ఫైటింగ్‌ సీన్లకు మేడమ్ మాధవీలత ఏమంటారు?

Hyderabad: సెల్ఫ్ ప్రమోషన్ అంతే.. ఆమెకంత సీన్ లేదు... మాధవీలతపై కరాటే కళ్యాణి ఫైర్
Madhavi Latha - Karate Kalyani
Ram Naramaneni
|

Updated on: Mar 08, 2024 | 7:06 PM

Share

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితాలో హాట్‌ సీట్లు ఎన్నున్నా హాటెస్ట్ సీట్ మాత్రం ఆ హైదరాబాదే. దశాబ్దాల తరబడి మజ్లిస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్‌లో పాగా వెయ్యాలని ఎప్పటినుంచో ప్లానేస్తోంది బీజేపీ. తాజాగా మాధవీలతకు ఎంపీ టికెట్ ఇచ్చి రణరంగంలో దించింది బీజేపీ అధిష్టానం. సామాజిక సేవకురాలిగా, మహిళా పారిశ్రామికవేత్తగా ఆమెకున్న నేపథ్యాన్ని చూసి హైకమాండ్ ఆ మేరకు నిర్ణయించింది. కానీ.. మాధవీలత పేరు పార్టీలో చాలామందికి రుచించలేదు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెర్షన్ ఐతే పార్టీని మరీ ఇబ్బంది పెట్టేసింది. మీకు మగాడే దొరకలేదా అంటూ అధిష్టానాన్ని నిలదీస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ లోపలా బైటా చర్చకు తావిచ్చాయి. మాధవీలత మాత్రం.. విమర్శల్ని తేలిగ్గా తీసుకున్నారు. తాజాగా మాధవీలతను ఇబ్బంది పెడుతూ మరో అపస్వరం బయటకు వచ్చింది. పేరు కరాటే కల్యాణి. సినిమా నటిగా, ఫైర్‌బ్రాండ్‌గా పార్టీలో చాలా ఏళ్లుగా యాక్టివ్‌గా ఉన్న కరాటే కల్యాణి.. ఇప్పుడు మాధవీలత ఎంపిక విషయంలో పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. మహిళకు సీటు ఇవ్వడాన్ని స్వాగతిస్తాను అంటూనే హిందుత్వవాదిగా నిరూపించుకోవాలంటే సోషల్ మీడియాలో షో చేయాలా అంటూ ఆమె చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా ద్వారా జనంలోకొచ్చింది తప్ప ఆమెకు అంత సీన్లేదు.. అనేది మాధవీలతకు కరాటే కల్యాణి ఇచ్చిన సర్టిఫికెట్. కష్టపడినవారికి టికెట్లు ఇవ్వకుండా, షో చేస్తున్న వారికే పెద్దపీటలెయ్యడం ఏంటంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విరుచుకుపడ్డారామె. తమలాంటి వాళ్లను ఎలక్షన్ క్యాంపెయిన్‌కు వాడుకుని.. యూజ్ అండ్ త్రోలా చూస్తున్నారని ఫైరయ్యారు.

అసంతృప్తుల్ని కలుపుకుపోతానంటున్న మాధవీలత ఈ కామెంట్స్‌ను లైట్ తీసుకుంటున్నారు. 8 లక్షలు హైందవులు పాత బస్తీలో ఉన్నారని.. వారంతా నిద్ర మేల్కొనాలని పిలుపునిస్తున్నారు. చరిత్ర సృష్టించడానికే పాతబస్తీలో అడుగుపెట్టా… ఆరునూరైనా.. హైదరాబాద్‌ని టేకోవర్ చేస్తాననేది మాధవీలతకున్న ధీమా. మరి.. ఆమె ఎంపిక విషయంలో పొరపాటు జరిగిందంటున్న మిగతా నేతల మనోగతాన్ని బీజేపీ అధినాయకత్వం పట్టించుకుంటుందా లేక.. లైట్ తీస్కుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…