Vande Bharat: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ట్రైన్‌లో ప్రయాణించాలనుకునేవారికి గుడ్ న్యూస్

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇటీవల పట్టాలెక్కిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌- తిరుపతి- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ ట్రైన్ నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది.

Vande Bharat: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ట్రైన్‌లో ప్రయాణించాలనుకునేవారికి గుడ్ న్యూస్
Vande Bharat Train
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 21, 2023 | 11:47 AM

సికింద్రాబాద్‌- తిరుపతి-  సికింద్రాబాద్‌ వందే భారత్ ట్రైన్‌కు ప్రజలు నుంచి భారీగా రెస్పాన్స్ వస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు  ఈ రైల్లో ప్రయాణిస్తున్నారు.  మంగళవారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30కి తిరుపతికి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 3.15కి తిరుపతి నుంచి బయల్దేరి రాత్రి 11.45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.  కేవలం ఎనిమిదన్నర గంటలు మాత్రమే ప్రయాణ సమయం ఉండటంతో.. ప్రయాణీకుల నుంచి ఆదరణ రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో 7 ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లు, 1 ఏసీ ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌ మాత్రమే ఉన్నాయి. దీంతో రిజర్వేషన్‌ దొరక్క యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో.. ఆయన రైల్వే అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే  రద్దీకి అనుగుణంగా కోచ్‌లు పెంచుతామని గతంలో ప్రకటించిన రైల్వే శాఖ.. తాజాగా అందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. త్వరలోనే 16 బోగీలతో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్దమైంది.

సికింద్రాబాద్‌ నుంచి పొద్దుపొద్దున్నే బయలుదేరే యాత్రికులు తిరుపతికి మధ్యాహ్నానికి చేరుకోవడంతో.. ముందస్తుగా రూ.300, బ్రేక్‌ దర్శనం బుకింగ్‌ చేసుకున్నవారు.. నేరుగా తిరుమలకు చేరుకుని నైట్ అక్కడ బస చేస్తున్నారు. తెల్లారి ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకుని, అదే రోజు మధ్యాహ్నం వందేభారత్‌ ట్రైన్‌లో రిటన్ అయ్యి రాత్రికి సికింద్రాబాద్‌కు వచ్చేస్తున్నారు. ప్రతిరోజూ 10 నుంచి 30 టికెట్ల వరకు వెయింటింగ్‌ లిస్టుతో వందే భారత్ ట్రైన్‌లో రద్దీ కొనసాగుతోంది. ఆపై ఖాళీలు ఉన్నట్లయితే , ట్రైన్ బయలుదేరే 4 గంటలు ముందుగానే కరెంట్‌ బుకింగ్‌ ద్వారా టికెట్లు పొందే సౌలభ్యం ఉంది. అంతేకాకుండా ట్రైన్ బయలుదేరే సమయానికి అరగంట ముందుగా టీటీఈ(Travelling ticket examiner)ని సంప్రదించి టికెట్‌ తీసుకోవచ్చు.

ఇక రేట్ల విషయానికి వస్తే సికింద్రాబాద్-నల్గొండ మధ్య చైర్‌ కార్‌ ఛార్జ్ 470 రూపాయలుగా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ అయితే రూ.900 ఉంటుంది. అలాగే సికింద్రాబాద్-గుంటూరు చైర్‌ కార్‌ అయితే రూ.865, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ రూ.1620 ఉంటుంది. సికింద్రాబాద్ – ఒంగోలు మధ్య చైర్‌ కార్‌ ధర రూ.1075, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ రూ.2045. అదే సికింద్రాబాద్-నెల్లూరు మధ్య చైర్‌ కార్ ధర రూ.1270, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ అయితే రూ.2455 ఉంటుంది. ఇక స్టార్టింగ్ పాయింట్ సికింద్రాబాద్ నుంచి డెస్టినేషన్‌ తిరుపతి మధ్య చైర్‌ కార్‌ అయితే రూ.1,680 ఉంటుంది. అదే ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ అయితే రూ.3080 ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!