Telangana: రైతు రుణమాఫీ నిధులు విడుదల.. రైతులతో సీఎం రేవంత్ మాటామంతి..

తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కార్యక్రమంలో మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రుణమాఫీ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. మొదటి విడతలో 11.42 లక్షల మంది రైతులకు రూ. 7 వేల కోట్లు జమచేయనున్నట్లు తెలిపారు.

Telangana: రైతు రుణమాఫీ నిధులు విడుదల.. రైతులతో సీఎం రేవంత్ మాటామంతి..
Cm Revanrh Reddy
Follow us
Srikar T

|

Updated on: Jul 18, 2024 | 11:00 PM

తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కార్యక్రమంలో మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రుణమాఫీ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. మొదటి విడతలో 11.42 లక్షల మంది రైతులకు రూ. 7 వేల కోట్లు జమచేయనున్నట్లు తెలిపారు. సచివాలయం నుంచి నేరుగా రైతులతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా ఒక రైతుతో మాట్లాడిన తరువాతనే బటన్ నొక్కి రుణమాఫీ నిధులు విడుదల చేశారు. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులు విడుదల చేస్తామన్నారు.

రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లోకి కాకుండా ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి రైతులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల సమయంలో సోనియా గాంధీ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు. రైతులతో ఎంత పొలం ఉందని, అప్పు ఎంత తీసుకున్నారని లచ్చమ్మ అనే మహిళా రైతును అడిగి తెలుసుకున్నారు. ఈరోజు సాయంత్రంలోపూ తన మొత్తం రుణం మాఫీ అవుతుందని హామీ ఇచ్చారు. తాను ఎల్లుండి ఢిల్లీకి వెళ్తున్నానని.. సోనియా గాంధీకి ఏమని చెప్పాలని వీడియోకాన్ఫిడెన్స్ ద్వారా అడిగారు. వెంటనే మహిళారైతు ధన్యవాదాలు తెలుపమని చెప్పారు. ఇదిలా ఉంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.

గాంధీ భవన్ వద్ద దీపా మున్షీ పార్టీ నాయకులకు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 31వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ. 2లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అలాటే రూపాయి రూపాయి కూడబెట్టి రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. రుణమాఫీపై అనేక మంది అవహేళన చేశారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలా అవహేళన చేసినవారు పదవులు కోల్పోయారన్నారు. దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని కీర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ హీరోతో లిప్ కిస్.. దెబ్బకు వాంతులు చేసుకున్న స్టార్ హీరోయిన్..
ఆ హీరోతో లిప్ కిస్.. దెబ్బకు వాంతులు చేసుకున్న స్టార్ హీరోయిన్..
తెలంగాణ ప్రభుత్వం సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తుందో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తుందో తెలుసా?
యూపీఐ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. క్రెడిట్ కార్డు చెల్లింపు షురూ
యూపీఐ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. క్రెడిట్ కార్డు చెల్లింపు షురూ
ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!
ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..