Harish Rao: పొరపాటా.? ఉద్దేశపూర్వకంగానేనా.? హరీష్ రావు కండువాపై చర్చ..
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత కేసీఆర్ ఆ ఆలోచనను విమరించుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే అసలు పార్టీ పేరు మార్చడమే తమ ఓటమికి కారణమని కొందరు నేతలు బహిరంగానే చెప్పారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ తిరిగి టీఆర్‌ఎస్‌గా మారనుందని చర్చలు జరిగిన విషయం తెలిసిందే...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్‌ఎస్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రాన్ని సాధించింది. ఆ తర్వాత వరుసగా రెండు సార్లు తెలంగాణలో అధికారాన్ని చేపట్టింది. అయితే మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అనుకున్న సమయంలో ఓటమి పాలైంది. గత అసెంబ్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. అయితే తెలంగాణ ఏకైక అజెండాగా ఏర్పాటైన టీఆర్‌ఎస్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌గా మారిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తామన్న కేసీఆర్ ఆ దిశగా శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రాతో పాటు ఏపీ, కర్ణాటకలో పోటీ చేయనున్నట్లు సైతం ప్రకటించారు.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత కేసీఆర్ ఆ ఆలోచనను విమరించుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే అసలు పార్టీ పేరు మార్చడమే తమ ఓటమికి కారణమని కొందరు నేతలు బహిరంగానే చెప్పారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ తిరిగి టీఆర్‌ఎస్‌గా మారనుందని చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఓ మీడియా సమావేశంలో కేసీఆర్ స్పష్టత కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ పార్టీ పేరు మార్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
అయితే తాజాగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ధరించిన కండువా పార్టీ పేరు మార్పునకు సంబంధించి చర్చకు తెర తీసింది. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరైన హరీష్ రావు బీఆర్‌ఎస్ కండువాకు బదులుగా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీ పేరు మారుతోందనే చర్చకు దారి తీస్తుంది. పార్టీ పేరు మార్చే ఆలోచనలో పార్టీ ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతాయి. అయితే మరికొందరు మాత్రం ఇదేదో పొరపాటుగా.. బీఆర్ఎస్ కండువా వేసుకోబోయి టీఆర్ఎస్ కండువా వేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు. ఒకవేళ పార్టీ పేరు మారి ఉంటే అధికారింగా ప్రకటించే వారు కదా! అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే పటాన్‌చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పటాన్ చెరు ఎమ్మేల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం స్పందిస్తూ.. ‘2001లో కేసీఆర్ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించారు. అప్పుడు కూడా కుట్రలు జరిగాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన 12మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. కానీ కుట్రలు ఫలించలేదు. న్యాయం గెలిచింది. కేసీఆర్ 14 ఏళ్లు పోరాడా రాష్ట్రాన్ని సాధించారు.బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనన్నవాళ్లు తర్వాత కనిపించకుండాపోయారు. పార్టీకి కష్టాలు వస్తాయి. మీరు ధైర్యంగా ఉండండి. మీ బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. కార్యకర్తలు అందరూ కష్టపడితేనే మహిపాల్ రెడ్డి గెలిచారు. పటాన్‌చెరుకు ఏం కావాలంటే అది ఇచ్చాం. రోడ్లు, తాగునీళ్లు, స్టేడియం వంటి ఎన్నో అందించాం. నిధులు వరద పారించాం. గూడెం పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు నిద్రపోం’ అంటూ తీవ్రంగా స్పందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..