Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్.. ఈ అంశాలపై చర్చ అప్పుడే..

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీ సెక్రటరీ అధికారికంగా వెలువరించారు. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల 25న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపట్టనున్నారు ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలుతో పాటూ పాలనపై కూడా ఫోకస్ పెట్టింది.

Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్.. ఈ అంశాలపై చర్చ అప్పుడే..
Telangana Assembly
Follow us
Srikar T

|

Updated on: Jul 18, 2024 | 6:22 PM

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీ సెక్రటరీ అధికారికంగా వెలువరించారు. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల 25న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపట్టనున్నారు ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలుతో పాటూ పాలనపై కూడా ఫోకస్ పెట్టింది. అయితే ప్రతిపక్షాలు కూడా ఈసారి తమ స్వరాన్ని బలంగా వినిపించేందకు సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెపార్టీలోకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పట్టుబడుతోంది ఆ పార్టీ. దీనిపై సభలో తీవ్రంగా చర్చిస్తామంటున్నాయి ప్రతిపక్షాలు.

అయితే జూలై 23 మంగళవారం ఉదయం 11 గంటల నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, 24న శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. ఈ సారి సభలో రైతు భరోసా పథకంపై చర్చతో పాటు, జాబ్ కాలెండర్‌, రైతు రుణమాఫీ విడుదల చేయటం వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడవ సెషన్స్ జరగనున్నట్లు కూడా ఈ అధికారిక నోటిఫికేషన్లో వెలువరించింది. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన అరోగ్య పరిస్థితుల దృష్ట్యా సమావేశాలకు హాజరుకాలేకపోయారు. ఈసారి అయినా సభాసమరానికి సిద్దంగా ఉన్నారా లేదా అనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..