AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..

ఆసిఫాబాద్ జనజాతర బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై అనేక ఆరోపణలు చేశారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆదిలాబాద్ సమస్యలను వినిపించేందుకు ఆదివాసీ ఆడబిడ్డకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. ఆసిఫాబాద్‎కు ఒక ప్రత్యేకత ఉందని.. ఆసిఫాబాద్ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తుందని చరిత్రను గుర్తు చేశారు.

Telangana: కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
CM Revanth Reddy
Srikar T
|

Updated on: May 02, 2024 | 5:59 PM

Share

ఆసిఫాబాద్‌ సభలో సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. BJPకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్నారు రేవంత్‌. రిజర్వేషన్లపై ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారన్నారు. ఢిల్లీ పోలీసులను పంపి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, ఇలాంటి కేసులకు తాను భయపడనన్నారు. గతంతో తనపై 200 వందల కేసులు పెట్టి చంచలగూడ, చర్లపల్లి జైలుకు పంపారని గతాన్ని గుర్తు చేశారు. అయినా తాను ఎక్కడా వెనకడుగు వేయలేదని ఆసిఫాబాద్ జనజాతర బహిరంగ సభలో ప్రజలకు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై అనేక ఆరోపణలు చేశారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆదిలాబాద్ సమస్యలను వినిపించేందుకు ఆదివాసీ ఆడబిడ్డకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. ఆసిఫాబాద్‎కు ఒక ప్రత్యేకత ఉందని.. ఆసిఫాబాద్ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తుందని చరిత్రను గుర్తు చేశారు. తెలంగాణ‎ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచి ఉంటే అభివృద్దికి మరింత అవకాశం ఉండేదన్నారు. ఈ ప్రాంతంలో కొమురంభీం ప్రాజెక్ట్ వట్టివాగు ప్రాజెక్ట్‎లున్నా.. సాగు నీరొచ్చే దారి లేదన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టి ఉంటే నీళ్ల కష్టాలు ఉండేవి కావని తెలిపారు. ఈ ప్రాంతం నుండి సోయం బాపురావును మీరు గెలిపిస్తే బీజేపీ అధిష్టానం ఈ ప్రాంతానికి ఒక్క మేలు చేయలేదని.. అభివృద్ది పనులు చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ కేంద్రంలో బీజేపీ కానీ ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. సోయం బాపురావుకు బీజేపీ మోసం చేసి ఈసారి టికెట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

కేసులపై సీఎం రేవంత్ కామెంట్స్ వీడియో..

మొట్టమొదటి సారి ఆదివాసీ ఆడబిడ్డ ఆత్రం సుగుణకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఆత్రం సుగుణ టీచర్‎గా పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ల భవిష్యత్ మీద ఎంత ఆలోచన ఉందో ఎంపిగా అవకాశం ఇస్తే అంతే ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తారని సీఎం రేవంత్ తెలిపారు. ఆనాడు ఇందిరమ్మ.. ఇంట్లో ఉండే పేద ఆదివాసీ బిడ్డకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అసెంబ్లీలో కొట్లాడుతున్నడని.. ఆత్రం సుగుణకు పట్టం కడితే అంతే జోష్ తో మీ తరుపున పార్లమెంట్‎లో గళం వినిపిస్తారన్నారు. నాకు ఆదిలాబాద్ అంటే ప్రత్యేక అభిమానం అన్నారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జిలు, విద్యాలయాలు నిర్మించే బాధ్యత తనదని సీఎం రేవంత్ చెప్పారు. ఈ ప్రాంతంలో మూతపడిన సీసీఐని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. భారతదేశంలో బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కలిసి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 1881 నుండి ఆనాటి బ్రిటిషర్స్ జనాభా లెక్కలను చేపట్టారని తెలిపారు. ప్రతి పదేళ్లకు ఓ సారి దేశంలో జనాభాను లెక్క కట్టడం సంప్రదాయంగా మారిందన్నారు. అయితే 2021 నుండి జనాభాను బీజేపీ లెక్క కట్టలేదన్నారు. ఎనిమిది రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టి రిజర్వేషన్ల రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే రిజర్వేషన్‎లు రద్దవుతాయని.. మీ ఓటుతో రిజర్వేషన్‎ను రద్దు చేయించుకుంటరా.. లేక రిజర్వేషన్ రద్దు చేద్దామంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తరా ఆదిలాబాద్ ప్రజలు ఆలోచన చేయండన్నారు.

ఇవి కూడా చదవండి

ఆసీఫాబాద్ సభలో సీఎం రేవంత్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..